పోలీసుల ఎన్‌కౌంటర్‌లో 20 మందికి పైగా నక్సల్స్ హతమయినట్లు యాంటీ-నక్సల్స్ ఆపరేషన్, స్పెషల్ డైరెక్టర్ జనరల్ డీఎం అవస్తి సోమవారం వెల్లడించారు. ఈ భీకర ఎన్‌కౌంటర్‌లో ఆదివారం ఛత్తీస్ఘడ్ లోని సుక్మా జిల్లాలో చోటుచేసుకుంది. భద్రతా బలగాలు, నక్సల్స్ కి దీటుగా బదులిచ్చారు. ఐదు గంటలపాటు నిర్విరామంగా కాల్పులతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ఐదు గంటలకు పైగా కాల్పులు జరిగాయి. నక్సల్స్ కు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మరణించారు. భద్రతా బలగాలు, నక్సల్స్ కు దీటుగా బదులిచ్చారు. 20 మందికి పైగా నక్సల్స్ హతమయ్యారు' అని ఆయన అన్నారు.


సుక్మా జిల్లాలో జరిగిన నక్సల్స్ కాల్పుల్లో ముగ్గురు మరణించారు. వీరిలో ఒక పౌరుడు, ఇద్దరు అసిస్టెంట్ కానిస్టేబుళ్లు ఉన్నారు. ఆరుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.