MP Bus Accident: ఘోర ప్రమాదం.. నదిలో పడిన బస్సు.. 13 మంది మృతి, 25 మంది గల్లంతు..!
MP Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం చెందారు.
MP Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న మహారాష్ట్ర స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు ధార్ జిల్లా ఖల్‌ఘాట్ (Khalghat area) వద్ద వంతెనపై నుంచి నర్మదా నదిలో (river Narmada) అదుపుతప్పి పడిపోయింది. ఉదయం 10.45 గంటలకు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన సమయంలో బస్సులో మహిళలు, పిల్లలుసహా 50 మందికిపైగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటివరకు నదిలో నుంచి 13 మంది మృతదేహాలను వెలికితీయగా... 15 మందిని అధికారులు రక్షించారు. నదిలో 25 నుంచి 27 మంది గల్లంతైనట్లుగా తెలుస్తోంది.
క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్రేన్ ద్వారా బస్సును బయటకు తీశారు. ఈ బస్సు ఇండోర్ నుండి మహారాష్ట్ర వెళ్తుంది. ఇది ఖల్ఘాట్ సంజయ్ సేతు వంతెనపై అదుపుతప్పి 25 అడుగుల దిగువన నదిలో పడిపోయింది. ధమ్నోద్ పోలీసులు మరియు ఖల్తాకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకున్నాయి. బస్సు ప్రమాదంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరా తీశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
Also Read: GST Rates Hike: సామాన్యుడికి కేంద్రం షాక్.. నేటి నుంచి పెరగనున్న నిత్యావసరాల ధరలు..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook