PM Cares For Children Scheme: ప్రధానమంత్రి కేర్ కింద చిన్నారులకు సాయం చేసే కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ప్రారంభించనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు, సంరకక్షులను కోల్పోయిన పిల్లలకు ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది. ఈ స్కీమ్ కింద మార్చి 2020 నుంచి ఫిబ్రవరి 28, 2022 మధ్యలో పేరెంట్స్ లేదా దత్తత తల్లిదండ్రులు లేదా ఏకైక ఆధారంగా ఉన్న తల్లి లేదా తండ్రి చనిపోయిన పిల్లలకు స్కాలర్ షిప్స్, పీఎం కేర్స్ పాస్ పుస్తకాలు అందిస్తారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు కూడా ఇస్తారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ లో భాగంగా కరోనా బాధిత చిన్నారులకు 18 సంవత్సరాలు వచ్చేసరికి... వాళ్ల పేరిట 10 లక్షల రూపాయలు ఉండేలా డిపాజిట్ చేస్తారు. ఆ డబ్బుపై వచ్చే వడ్డీని 18 నుంచి 23 ఏండ్ల వరకు వాళ్లకు ఇస్తారు. బాధితుడికి 23 ఏళ్లు రాగానే.. డిపాజిట్ చేసిన 10 లక్షల నగదును లబ్దిదారుడికి అందిస్తారు. ఈ పథకం కింద లబ్దిదారులను ఎంపిక చేసేందుకు పీఎం కేర్స్ ఫర్ చిల్డరన్ పేరుతో కేంద్ర సర్కార్ ప్రత్యేక పోర్టల్ ప్రారంభించింది. పేర్ల నమోదు నుంచి సాయం అందించేవరకు మొత్తం ప్రాసెస్ అంతా ఈ పోర్టల్ ద్వారానే సాగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. కరోనా వేలాదిమంది చిన్నారులను అనాథలు చేసింది. వైరస్ సోకడంతో చాలా కుటుంబాలు పోషకులను కోల్పోయాయి. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. అలాంటి వాళ్లకు అండగా ఉంటామని గత సంవత్సరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇందుకోసమే పీఎం కేర్ల్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని ప్రకటించారు.
స్కీమ్ కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర మహిళలు పిల్లల అభివృద్ధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. తర్వాత కేంద్ర సర్కార్ రూపొందించిన పోర్టల్ ద్వారా ఆన్ లైన్ లో అర్హుల దరఖాస్తులు తీసుకున్నారు. లబ్దిదారులను ఎంపిక చేశారు.  29 మే 2021 నుంచి 31 డిసెంబర్ 2021 వరకు ఈ పథకంలో నమోదు చేసుకున్న వారికే ఈ స్కీమ్ వర్తించనుంది.


పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్  పథకానికి అర్హతలు:


కరోనా మహమ్మారి కారణంగా పేరెంట్స్ ఇద్దరిని పిల్లలకు వర్తిస్తుంది. తల్లిదండ్రులు చనిపోయిన తేది నాటికి పిల్లల వయస్సు 18 సంవత్సరాల లోపే ఉండాలి.


పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ప్రయోజనాలు:


-  కరోనాతో  తల్లిద్రండులు కోల్పోయిన పిల్లలకు 18 ఏళ్లు రాగానే స్కాలర్ షిప్ వస్తుంది
-  లబ్దిదారుడుకి 23 ఏళ్లు రాగానే  పీఎం కేర్ నుంచి రూ. 10 లక్షలు అందిస్తారు
-  ఉన్నత విద్య కోసం రుణం ఇస్తారు. పీఎం కేర్స్ తరపున ఆ లోన్‌కు సర్కారే వడ్డీ చెల్లిస్తుంది.
-  18 సంవత్సరాలు వచ్చే వరకు  5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్‌ 


READ ALSO: Somvati Amavasya Shani jayanthi 2022: సోమావతి అమావాస్య అంటే? శని జయంతిన ఏం చేయాలి ?


READ ALSO: BJP Rajya Sabha Candidates: బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల... ఏయే రాష్ట్రాల నుంచి ఎవరికి ఛాన్స్ ఇచ్చారంటే... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook