Anant Ambani Pre Wedding Event: పెళ్లి కాదు..ప్రీ వెడ్డింగే..ప్లేట్ భోజనం ఖర్చు 15 వేలు ఎన్ని వంటలంటే
Anant Ambani Pre Wedding Event: రాజుగారింట్లో పెళ్లి జరిగితే వంటకాలకు కొదవ ఉంటుందా..ఇక్కడ కూడా అంతే. ప్రపంచ కుబేరుడి కుమారుడి వివాహ సంబారాలు అత్యంత ఘనంగా జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Anant Ambani Pre Wedding Event: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయాయి. పెళ్లి ఎలా ఉంటుందో ఇంకా అంచనాల్లేవు కానీ ప్రీ వెడ్డింగ్ మాత్రం అంగరంగ వైభవంగా జరిపేందుకు సిద్ధమౌతున్నారు. మొత్తం ఖర్చంతా వంటలపైనే పెడుతున్నారు.
ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ ఇంటివాడౌతున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ రాధికా మర్చంట్‌ను పెళ్లి చేసుకోనున్నాడు. కుబేరుడి ఇంట్లో పెళ్లి కదా..ఏర్పాట్లు కూడా అలానే ఉంటున్నాయి. ఒక రోజు పెళ్లిలా కాకుండా ఓ సంబారాలుగా జరపనున్నారు. వెడ్డింగ్ ఎంత ఘనంగా చేస్తారనేది ప్రీ వెడ్డింగ్ ఏర్పాట్లు చూస్తే తెలిసిపోతుంది. గుజరాత్ జామ్‌నగర్‌లో అనంత్ వెడ్స్ రాథికా ప్రీ వెడ్డింగ్ వేడుక మార్చ్ 1-3 తేదీల్లో జరగనుంది. దేశ విదేశాల్నించి 1000 మంది ప్రముఖులు ప్రీ వెడ్డింగ్ వేడుకకు హాజరుకానున్నారు. వీరిలో బిల్‌గేట్స్, మార్క్ జుకర్‌బర్గ్ వంటి ప్రముఖులున్నారు.
రాజుగారింట్లో పెళ్లి కదా..వంటలకు కొదవ ఉండదు
రాజుగారింట్లో పెళ్లంటే వంటల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవల్సిన అవసరం ఉండదు. ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో అన్నింటికంటే ప్రత్యేకం ఫుడ్ అని చెప్పవచ్చు. ఎంతంటే ఒక్కొక్కరిపై ఒక్కరోజు భోజనం ఖరీదు 15 వేల రూపాయలుంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల వంటలు ఇక్కడ దర్శనమివ్వనున్నాయి. ఒకటి కాదు రెండు కాదు..వందలు కాదు..2500 రకాల వంటలు సిద్ధం చేయనున్నారు. మొత్తం 65 మంది సూపర్ చెఫ్‌లు రంగంలో దిగుతున్నారు. ఇండియన్ ఫుడ్, ఏషియన్ కాంటినెంటల్ స్పెషల్, మెడిటేరియన్ ఫుడ్, పార్శీ ఫుడ్, థాయ్, మెక్సికన్, జపనీస్ ఫుడ్ ఉంటుంది.
ప్రీ వెడ్డింగ్‌లో వంటలే ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఎందుకంటే మూడు రోజుల వేడుకలో ఏ ఒక్క వంట రిపీట్ కాదంటే అతిశయోక్తి కానే కాదు. అందుకే అన్ని రకాల వంటలు సిద్ధం చేస్తున్నారు. బ్రేక్ ఫాస్ట్‌లో 75 రకాల వంటలు, లంచ్‌లో 250 రకాలు, డిన్నర్‌లో 275 రకాలు ఉంటాయి. ఇవి కాకుండా 85 రకాల స్నాక్స్ ఉంటాయి. మొదటి రోజు సర్వ్ చేసిన వంటల్లో ఏదీ రెండో రోజు రిపీట్ కాదు. రెండో రోజు సర్వ్ చేసినవాటిలో ఏదీ మూడో రోజు రిపీట్ కాదు. నోరూరించే వంటకాలతో అతిధుల్ని ఆకట్టుకోనున్నారు. ప్రీ వెడ్డింగ్‌కే ఇలా చేస్తుంటే ఇక పెళ్లి ఎలా ఉంటుందోననే చర్చ అప్పుడే మొదలైపోయింది. అనంత్ వెడ్స్ రాధిక నిశ్చితార్ధం జరిగి ఏడాది దాటింది. 2023 జనవరిలో నిశ్చితార్ధం జరగగా వచ్చే నెలలో ప్రీ వెడ్డింగ్, వెడ్డింగ్ జరగనుంది.
ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ వీరేన్ మెర్చంట్ కుమార్తె రాధికా మర్చంట్. ఈ పెళ్లి ముంబైలో జూలై 12 వతేదీన అత్యంత ఘనంగా జరగనుంది. పెళ్లికి సైతం మార్క్ జుకర్‌బర్గ్ , బిల్‌గేట్స్, దేశంలోని ప్రముఖులంతా హాజరుకానున్నారు.
Also read: South Indian Beautiful Places: మార్చ్‌లో వెకేషన్‌కు దక్షిణ భారతంలోని టాప్ 5 అద్భుత ప్రదేశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook