Mukesh Ambani touches Radhika Merchant in inappropriate way: దేశంలోని టాప్ మోస్ట్ వ్యాపారవేత్తలలో ముకేశ్ అంబానీ కూడా ఒకరు. ఏదో ఒక విధంగా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. జూలైలో అంబానీ తన చిన్న కొడుకు ఆనంత్ అంబానీ వివాహం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. భారీ స్థాయిలో బోలెడు మంది సెలెబ్రిటీల మధ్య ఈ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. ఈ వేడుకలు చాలా కాలం పాటు హాట్ టాపిక్ గానే నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇప్పుడు ఆ వేడుకలు పూర్తి అయ్యాయి కానీ.. అంబానీ కుటుంబం మరోసారి వార్తల్లోకెక్కింది. ప్రస్తుతం జరుగుతున్న గణపతి ఉత్సవం సందర్భంగా ముకేశ్ అంబానీ లాల్బాగ్ చా రాజా లో గణపతిని దర్శించుకున్న సమయంలో ఒక వీడియో వైరల్ అయ్యింది. 


ముకేశ్ అంబానీ, ఆయన కొడుకు ఆనంత్, కోడళ్లు రాధికా మెర్చంట్, శ్లోకా అంబానీలు ఇటీవల ముంబైలోని లాల్బాగ్ చా రాజా గణపతిని దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు అధికారులు. కానీ, ఈ దర్శనానికి సంబంధించిన వీడియోలో ఉన్న ఒక దృశ్యం నెటిజన్లను ఆగ్రహానికి గురి చేసింది.


ఆ వీడియోలో ముకేశ్ అంబానీ తన కోడలు రాధికా మెర్చంట్ ను గుంపులోకి వెళ్లకుండా ఆపడం కోసం ఆమె నడుముపై చేయి వేసి ఆమెను వెనక్కి లాగడం ఇప్పుడు వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ వీడియోపై విమర్శల వర్షం కురిసింది. 


ఈ నేపథ్యంలో ఒకరు ప్రశ్నిస్తూ, "తమ కోడలిని ఈ విధంగా తాకే తండ్రి ఎవరైనా ఉంటారా?" అని కామెంట్ చేసారు. మరొకరు "తండ్రి కోడలిని ఇలా తాకడం సమంజసం కాదు" అని అన్నారు. కొంతమంది రాధికా కూడా ఆ సమయంలో చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యింది అని పేర్కొన్నారు. 


"అంతగా జనాల గుంపు కూడా లేదు. కానీ ముకేశ్ అంబానీ ఇలా రాధికాను లాక్కున్న విధానం బాలేదు అని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. ఈ నేపద్యంలో ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా.. పబ్లిక్ లో ఉన్నప్పుడు కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


 



Also Read: September 17th: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌ 17వ తేదీకి మరో కొత్త పేరు


Also Read: Ganesh Immersion: గణేశ్‌ నిమజ్జనంలో మద్యం, అమ్మాయిలపై ఈవ్‌టీజింగ్‌.. ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.