ప్రస్తుతానికి కొత్త పార్టీ ఆలోచన లేదన్న ములాయం
ములాయం కుటుంబంలో ఏర్పడిన విభేదాలు పతాకస్థాయికి చేరుకుని కొత్త పార్టీ ప్రకటిస్తారనే ఉహాగానాలకు తాత్కాలికంగా తెరపడింది. సోమవారం విలేఖరుల సమావేశంలో ఈ అంశంపై మలాయం స్పందిస్తూ ప్రస్తుతానికి కొత్త పార్టీ ఉండబోదని వెల్లడించారు. తండ్రిగా అఖిలేష్ కు నా ఆశీస్సులు ఉంటాయి..కానీ అఖిలేష్ తీసుకుంటున్న అన్ని నిర్ణయాలను సమర్ధించలేనని బాంబుపేల్చారు.
బీజేపీ హయంలో మతసామరస్యం కరువైంది ...
మీడియా సమావేశంలో ములాయం సింగ్ యాదవ్ బీజేపీ సర్కార్ పై విమర్శలు సంధించారు. బనారస్ హిందూ యూనివర్శిటీలో హింసాకాండ చెలరేగడం, పెట్రోల్ ధరలు పెరిగిపోవడం, రైతు రుణాల మాఫీ తదితర అంశాల్లో యోగి సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. బనారస్ వర్శిటీలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని..ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు దిగజారిపోయాయని ఆరోపించారు. రైతుల పరిస్థితి కూడా దయనీయంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల కాలంలో యూపీ సహా దేశ వ్యాప్తంగా మత కల్లోలాలుజరిగాయని ములాయం విమర్శించారు