Mulayam Singh Yadav Dead: ములాయం సింగ్ యాదవ్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్, ఆస్తి వివరాలు ఇవే!
Mulayam Singh Yadav Family and net worth details. యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ములాయం ఫామిలీ, ఎడ్యుకేషన్, ఆస్తి వివరాలు ఇవే.
UP Former CM Mulayam Singh Yadav Family, education and net worth details: సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ (82) సోమవారం ఉదయం కన్నుమూశారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో మేదాంత ఆస్పత్రిలో దాదాపుగా 40 రోజుల పాటు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న ఆయన ఆరు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ పొలిటికల్ కెరీర్ కొనసాగించారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి యూపీ ‘నేతాజీ’ పేరు తెచ్చుకున్నారు.
ప్రస్తుతం ఎస్పీ చీఫ్ మరియు యూపీ మాజీ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్.. దివంగత ములాయం సింగ్ యాదవ్ కుమారుడు. ములాయం మొదటి భార్య మాలతీ దేవి కుమారుడు అఖిలేష్. మాలతీ దేవి 2003లో మరణించారు. మాలతీ కన్నుమూసిన అనంతరం సాధనా యాదవ్‌ను ములాయం పెళ్లి చేసుకున్నారు. ఇటీవల సాధనా యాదవ్ కూడా కన్నుమూశారు. రెండో భార్య కుమారుడే ప్రతీక్ యాదవ్. ప్రతీక్ యాదవ్ సతీమణి అపర్ణా యాదవ్ ఇటీవల భాజపాలో చేరారు.
ములాయం సింగ్ యాదవ్ ఎడ్యుకేషన్ వివరాలు ఓసారి పరిశీలిస్తే.. ఇటావా, షికోహాబాద్ మరియు ఆగ్రా యూనివర్శిటీలలోని వివిధ విశ్వవిద్యాలయాల నుంచి రాజకీయ శాస్త్రంలో B.A, B.T, మరియు M.A డిగ్రీలు పొందారు. ములాయం సింగ్ యాదవ్ మొత్తం నికర ఆస్తి విలువ 2019 నాటికి రూ. రూ. 20.56 కోట్లు.
సుదీర్ఘ రాజకీయ జీవితంలో ములాయం సింగ్ యాదవ్ మూడుసార్లు యూపీ సీఎంగా, ఏడుసార్లు ఎంపీగా, పదిసార్లు ఎమ్మెల్యేగా, ఓసారి కేంద్ర మంత్రిగా సేవలందించారు. ములాయం 1970లలో రాజకీయాల్లో ఎదిగారు. ఉత్తరప్రదేశ్ జిల్లా మెయిన్‌పురి నుండి పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించారు. 1989 నుంచి1991 వరకు, 1993 నుంచి 1995 వరకు, 2003 నుంచి 2007 వరకు మూడుసార్లు సీఎంగా ఎన్నికయ్యారు. 1996 నుంచి 1998 వరకు కేంద్ర రక్షణ మంత్రిగా పనిచేశారు. ములాయం 1967లో మొదటి ఎన్నిక విజయం సాధించారు. 1989లో మొదటిసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఇక 1992లో సమాజ్ వాదీ పార్టీని స్థాపించారు.
Also Read: Prabhas -Maruthi: ప్రభాస్-మారుతి మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..
Also Read: Mulayam Singh Yadav Dies: ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook