ముంబైలో రాహుల్ గాంధీ హగ్ పోస్టర్లు
గత రెండు రోజులుగా రాహుల్ గాంధీ-నరేంద్ర మోదీ హగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.
గత రెండు రోజులుగా రాహుల్ గాంధీ-నరేంద్ర మోదీ హగ్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ హగ్‌పై సోషల్ మీడియాలో చాలా మంది నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. ఎంతో మందిని ఆకట్టుకున్న ఈ సన్నివేశం తాజాగా ముంబయిలో పోస్టర్ల రూపంలో దర్శనమిచ్చింది. ‘ప్రేమతో గెలుద్దాం.. ద్వేషంతో కాదు’ అని ఆ పోస్టర్ మీద కాంగ్రెస్ పార్టీ క్యాప్షన్ కూడా పెట్టింది. ముంబయి మహానగర కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీ నిరుపమ్ ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఆ పోస్టర్‌లో రాహుల్ గాంధీ, మోదీని హగ్ చేసుకున్న ఫొటోతో పాటు హిందీలో పైవిధంగా క్యాప్షన్ ఉంది.
మరోవైపు శివసేన.. తన సామ్నా పత్రికలో అవిశ్వాస తీర్మానాన్ని ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌తో పోల్చింది. మోదీని ఫ్రాన్స్‌తో.. రాహుల్‌ను క్రొయేషియాతో పోల్చింది. మోదీ ఫ్రాన్స్ వలే గెలిచాడంటూ పేర్కొంది. గ్రూప్ దశను దాటడమే కష్టమనుకున్న క్రొయేషియా ఫైనల్‌కు చేరుకొని ఆకట్టుకుందని.. అలానే రాహుల్ గాంధీ కూడా ప్రజల మనసుల్ని గెలిచాడంటూ శివసేన వ్యాఖ్యానించింది.