Mumbai High Court: సీరమ్ ఇనిస్టిట్యూట్ అధినేతపై ముంబై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అదార్ పూణావాలా భద్రతపై భరోసా ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అసలేం జరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిషీల్డ్ వ్యాక్సిన్ ( Covishield) ఉత్పత్తి చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ (Serum Institute) అధినేత అదార్ పూణావాలా ఇటీవల కొద్దిరోజుల క్రితం లండన్‌కు వెళ్లిపోయారు. వ్యాక్సిన్ సరఫరాకు సంబంధించి తనపై ఒత్తిళ్లు వస్తున్నాయని..బెదిరింపులు ఎక్కువవుతున్నాయని..అందుకే కొద్దికాలం లండన్‌లో ఉంటానంటూ వెళ్లిపోయారు. కోవిషీల్డ్ డోసుల కేటాయింపుపై అదార్ పూణావాలాకు బెదిరింపులు వస్తుండటంతో భయంతో జీవిస్తున్నారని కోర్టుకు పిటీషనర్ తెలిపారు. అదార్ పూణావాలాకు జెడ్ ప్లస్ కేటగరీ భద్రత కల్పించాలని కోరారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన ముంబై హైకోర్టు అదార్ పూణావాలా భద్రతపై భరోసా ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భద్రతకు సంబంధించి ఆయనకున్న అన్ని సందేహాల్ని తొలగించాలని సూచించింది. 


కోవిడ్ 19 వ్యాక్సిన్ తయారు చేయడం ద్వారా అదార్ పూణావాలా(Adar Poonawalla) దేశానికి మంచి సేవ చేస్తున్నారని ముంబై హైకోర్టు (Mumbai High Court) వ్యాఖ్యానించింది. అదార్ పూణావాలాతో మహారాష్ట్ర ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా మాట్లాడాలని తెలిపింది. పూణావాలా ఇండియాకు తిరిగొచ్చిన తరువాత భద్రతపై భరోసా ఇవ్వాలని పేర్కొంది.


Also read: Foreign Vaccine: ఆ వ్యాక్సిన్లకు ఇండియాలో ట్రయల్స్ అవసరం లేదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook