Mumbai mayor Kishori Pednekar gets letter with life threat : తన ప్రాణాలు తీస్తామంటూ బెరిరింపులు వచ్చాయంటూ ముంబై మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. శివసేన నేత అయితే కిశోరికి ఇలాంటి బెదిరింపులు రావడం ఇదేమీ ఫస్ట్ టైమ్ కాదు. గతేడాది కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. ఓ అజ్ఞాతవాసి ఆమె ఫోన్ చేసి గతేడాది డిసెంబర్‌‌లో బెదిరించాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈసారి కిశోరికి (Kishori Pednekar) ఒక లెటర్ వచ్చింది. ఆమెను, ఆమె కుటుంబ సభ్యుల్ని దారుణంగా మరాఠీలో భాషలో తిడుతూ లేఖ రాశారు. కిశోరి.. నువ్వు దాదాతో (Dada) చెలగాటం ఆడుతున్నావ్.. ఖబడ్దార్ అంటూ కిశోరిని హెచ్చరించారు. దీంతో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


Also Read : Rishabh Pant Girlfriend: టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ లవర్ ను ఎవరో తెలుసా?


గతేడాది కూడా ఇలాగే ఫోన్ చేసిన బెదిరించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. గుజరాత్‌లోని జామ్‌ నగర్‌‌కు చెందిన ఆ వ్యక్తిని పోలీసులు (Police) అరెస్ట్ చేశారు. అయితే గత నెలలో ముంబైలో జరిగిన ఒక సిలిండర్‌ పేలుడు ఘటనపై మేయర్‌ కిశోరి పెడ్నేకర్‌ (Kishori Pednekar) బీజేపీ ఎమ్మెల్యే అసీశ్ షెలర్‌‌ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కిశోరి పెడ్నేకర్‌కు బెదిరింపులు మొదలయ్యాయి.


Also Read : Bigg Boss 5: బిగ్‌‌బాస్ 5 విన్నర్ సన్నీ.. కానీ ట్విస్ట్ ఏంటంటే..? సోషల్ మీడియాలో ఫోటో హల్‌చల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook