Mumbai Police: 10కల్లా హాజరు కావాలని నటి కంగనా, రంగోలికి నోటీసులు
మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై బాంద్రా కోర్టు ఆదేశాలతో అక్టోబరు 17న ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి సింగ్‌లకు ముంబై పోలీసులు నోటీసులు పంపారు.
Mumbai Police summons to Kangana Ranaut and Rangoli: ముంబై: మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ( Kangana Ranaut) పాటు ఆమె సోదరి రంగోలి చందేల్‌పై బాంద్రా కోర్టు ఆదేశాలతో అక్టోబరు 17న ముంబై పోలీసులు ( Mumbai Police) కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ.. నటి కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి సింగ్‌లకు ముంబై పోలీసులు నోటీసులు పంపారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వివాదస్పద పోస్టులపై 10 కల్లా ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్‌లో హాజరై వివరణ ఇవ్వాలని నోటీసులు పంపినట్లు అధికారులు వెల్లడించారు.
అయితే కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్ బాలీవుడ్, ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దీంతోపాటు మత విద్వేశాలను రెచ్చగొడుతున్నారంటూ ఫిర్యాదు చేయగా.. పోలీసులు తన ఫిర్యాదును నమోదు చేయలేదంటూ మున్నవారలి అకసాహిల్ అష్రాఫలి సయ్యద్ బాంద్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన బాంద్రా కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించింది. అంతకుముందు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తుమకూరు కోర్టు ఆదేశాల మేరకు కంగనాపై ఎఫ్‌ఐఆర్ దాఖలైన సంగతి తెలిసిందే. దీంతోపాటు పాటు ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి సైతం ఆగ్రహం వ్యక్తంచేశారు. Also read: Maharashtra: కంగనాకు విమర్శలకు సమాధానమిచ్చిన ఉద్ధవ్ థాకరే
ఇదిలాఉంటే.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నాటినుంచి కంగనా రనౌత్ నిత్యం ఘాటైన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. మొదట్లో బాలీవుడ్‌లో నెపోటిజం, ఆతర్వాత డ్రగ్స్‌పై కామెంట్లు చేసిన కంగనా.. అనంతరం ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంపైన (Maharashtra Government ) అదేవిధంగా శివసేన ప్రముఖుల మీద పలు వ్యాఖలు చేస్తూ వస్తోంది. Also read: Kangana Ranaut: విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ మరో కేసు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe