ఈ సంఘటన హాలివుడ్ సినిమా షాట్‌కు ఏ మాత్రం తీసిపోని రీతిలో జరిగింది. మంబయిలోని వాడీ రైల్వే స్టేషన్‌లో రైలు ఆటోమెటిక్‌గా స్టార్ట్ అయ్యి దాదాపు 13 కిలోమీటర్లు ప్రయాణించింది. డ్రైవరు లేకుండా.. అసలు ఇంజిన్ స్టార్టే చేయకుండా ఈ రైలు అంతదూరం ఎలా ప్రయాణించిందో ఎవరికీ అర్థం కాక ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు రైల్వే అధికారులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా అనుకోకుండా ఇంజిన్ స్టార్టు అయ్యి రైలు పట్టాల మీదకు వచ్చేసిందనే విషయం తెలియడంతో ఆ స్టేషన్‌లోని కొందరు ఉద్యోగులు దానిని కొన్ని కిలోమీటర్ల వరకూ మోటార్ బైక్ పై వెంబడించారట. ఈలోగా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి రైల్వే లైన్స్, ట్రాకులు అన్నీ క్లియర్ చేయాల్సిందిగా మిగతా స్టేషన్లకు సమాచారం పంపించారు.


దాదాపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చెన్నై నుండి ముంబయి వస్తున్న రైలు, కల్బర్గీ జిల్లాలో వాడీ స్టేషనుకు వచ్చినప్పుడు, ఎలక్ట్రిక్ ఇంజిన్ బదులుగా డీజల్ ఇంజిన్ అనుసంధానం చేయడానికి డ్రైవరు క్రిందకు దిగారు.


అయితే డ్రైవరు దిగగానే.. ఏదో సాంకేతిక లోపం వల్ల ఎలక్ట్రిక్ ఇంజిన్ దానిమటుకు అదే ముందుకు కదలడం ప్రారంభించింది. ఏం జరుగుతుందో తెలిసుకొనేలోపే, రైలు పట్టాలెక్కేసింది. అయితే సమాచారం అందివ్వగానే అవతలి నుండి వస్తున్న రైళ్లను కూడా దాదాపు రూట్ మళ్లించేపనిలో పడిపోయారు అధికారులు.  ఆ తర్వాత రైలులో ఉన్న సిబ్బందితోనే ఎలాగోలా మాట్లాడి ఇంజిన్‌ను ఆపించారు అధికారులు.