Muzaffarnagar Man murdered wife body thrown in the forest : భార్యపై అనుమానం పెంచుకున్న భర్త చివరకు ఆమెను కడతేర్చాడు. నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకున్నాడు. తన భార్యకు మ‌రో వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం ఉందని అనుమానించిన భర్త... ఆమెను హ‌త్య చేయాల‌ని డిసైడ్ అయ్యాడు. అందుకోసం పక్కా ప్లాన్ వేశాడు.. చివరకు ఒక క‌త్తిని ప్రత్యేకంగా కొనుగోలు చేసి ఆమెను గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ (Muzaffarnagar)  జిల్లాలో జరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లా బుధానా పోలీస్‌ స్టేష‌న్ (Police Station) ప‌రిధిలోని ఒక టైల్స్ ఫ్యాక్ట‌రీలో బీహార్‌కు చెందిన గుల్షాద్ తన భార్య రిఫత్ ఖాతూన్  పని చేసేవారు. వారితో పాటు ఫ్యాక్ట‌రీలో ప‌ని చేసే మ‌రో వర్కర్‌‌తో తన భార్య రిఫత్ ఖాతూన్ (Rifat Khatoon) అక్రమ సంబంధం ఉందని భర్త గుల్షాద్ (Gulshad) భావించాడు. భార్యపై రోజురోజుకు అతనికి అనుమానం పెరిగింది. ఎలాగైనా భార్యను చంపేయాలనుకున్నాడు. 


Also Read : IND vs NZ: అంపైర్ తప్పిదానికి బలి.. ఔట్ అయిన కోపంలో విరాట్ కోహ్లీ ఏంచేశాడంటే(వీడియో)


క‌త్తితో ఆమెపై గొంతుకోసి చంపేశాడు గుల్షాద్. తర్వాత ఆ బాడీని తీసుకెళ్లి దగ్గరలో ఉండే అడవుల్లో పాడేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు (Police) దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.


Also Read : Jawad Cyclone: జవాద్​ తుఫానుగా మారిన అల్ప పీడనం- ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook