బెంగాల్ ప్రజలకు నా విజ్ఞప్తి: వీడియో విడుదల చేసిన అయిషే ఘోష్
ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ రెండు రోజుల పర్యటనపై జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అధ్యక్షురాలు అయిషే ఘోష్ స్పందిస్తూ.. మోదీ చేస్తున్న “విభజన రాజకీయాలను” వ్యతిరేకించాలని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ 37 సెకన్ల నిడివి గల వీడియోను విడుదల చేసింది.
కోల్‌కతా: ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ రెండు రోజుల పర్యటనపై జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అధ్యక్షురాలు అయిషే ఘోష్ స్పందిస్తూ.. మోదీ చేస్తున్న “విభజన రాజకీయాలను” వ్యతిరేకించాలని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ 37 సెకన్ల నిడివి గల వీడియోను విడుదల చేసింది.
ఢిల్లీ నుండి ప్రసారం చేసిన వీడియో సందేశంలో అయిషే ఘోష్ మాట్లాడుతూ.. మోడీ ఈ రోజు బెంగాల్‌కు వస్తున్నారు. బెంగాల్ ప్రజలకు నా విజ్ఞప్తి. భారతీయ జనతా పార్టీ భారతదేశం అంతటా విభజన రాజకీయాలను వ్యాప్తి చేస్తోందనీ, ఈ విభజన రాజకీయాలను బెంగాల్‌లో అనుమతించకూడదని విజ్ఞప్తి చేశారు. బీజేపి తీసుకున్న నిర్ణయాలను తిప్పికొట్టాలని అమె అన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..