Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు
Flight Crashed in Mizoram: పక్కదేశానికి సైనిక విమానం ప్రమాదవశాత్తు మన దేశంలో కుప్పకూలింది. రన్‌వేపై దిగుతూ అదుపు తప్పి పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో విమానంలో 13 మంది ఉన్నట్లు సమాచారం.
Mizoram Flight Crashed: పక్క దేశం మయన్మార్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉంది. అక్కడ ప్రజాస్వామ్యం బదులు సైనిక పాలన కొనసాగుతోంది. ఈ సందర్భంగా అనేక తిరుగుబాటు ఉద్యమాలు జరుగుతున్నాయి. తీవ్ర ఘర్షణలతో ఆ దేశం అట్టుడుకుతుండడంతో ఆ దేశానికి చెందిన ప్రజలు, సైనికులు భారత్‌లోకి అక్రమంగా వలస వస్తున్నారు. ఈ సమయంలో మంగళవారం ఉదయం కూడా ఓ విమానం మిజోరంలోని లెంగ్‌పుల్ విమానాశ్రయానికి చేరుకుంది. టేబుల్ టాప్ రన్‌వే కావడంతో విమానం దిగుతూ రన్‌వే పై నుంచి జారింది. జారిన విమానం పొదల్లోకి వెళ్లింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 13 మంది ఉన్నారని తెలుస్తోంది.
ప్రమాదం వెంటనే స్పందించిన మిజోరం అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదంలో 8 మంది తీవ్రంగా గాయపడ్డారని మిజోరం అధికారులు ప్రకటించారు. మిగతా వారు స్వల్ప గాయాలతో గాయపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే మయన్మార్ వాళ్లు ఎందుకు వచ్చారో అనేది తెలియాల్సి ఉంది.
కాగా మనదేశంలోకి కొంతకాలంగా చొరబడుతున్న ప్రజలు, సైనికులను భారత ప్రభుత్వం తిరిగి మయన్మార్‌కు పంపిస్తోంది. ఆ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా ఆ దేశ సైనికులు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఈక్రమంలో భారత్‌కు కూడా వస్తున్నారు. అలా 276 మంది సైనికులు భారత్‌లోకి చొరబడ్డారు. వారిలో 184 మందిని తిరిగి మయన్మార్‌కు పంపినట్లు అస్సామ్ రైఫిల్స్ అధికారులు తెలిపారు. మిగిలిన 92 మందిని త్వరలో పంపిస్తామని చెప్పారు. ఇప్పటివరకు దేశంలోకి 635 మంది మయన్మార్ దేశానికి చెందిన సైనికులు చొరబడ్డారు. ఆ దేశం నుంచి అక్రమ వలస నివారణ కోసం మిజోరం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అక్రమంగా వచ్చిన వారిని తిరిగి వారి స్వదేశానికి పంపుతోంది. ఈ క్రమంలోనే ఈ విమాన ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook