హర్యానా: ముస్లింలు నమాజును మసీదులు, ఈద్గాలలో మాత్రమే పఠించాలని, బహిరంగ ప్రదేశాల్లో పఠించరాదని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తర్ చెప్పారు. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఇటీవల బహిరంగ ప్రదేశాల్లో నమాజు పఠనాలు పెరగడంపై అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


కొందరు చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా మసీదులో కలిపేసుకోవాలని చూస్తున్నారంటూ రెండు వారాలుగా గురుగ్రామ్‌ లో హిందుత్వ గ్రూపులు శుక్రవారం ప్రార్థనలకు అడ్డు తగులుతున్నాయి. శుక్రవారం కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రార్థనలకు అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రార్థనలు జరుగుతున్న ప్రతిచోటుకి వీహెచ్ పీ, బజరంగ్‌ దళ్, హిందూ క్రాంతి దళ్, గోరక్షక్ దళ్, శివసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నమాజ్ చేయకుండా జై శ్రీరాం, రాధె రాధె అంటూ నినాదాలు చేశారు. దీనిపై హిందూ సంస్థలు స్పందిస్తూ వీరు నమాజు పేరుతో ఆ ప్రాంతాలను తమ సొంతం చేసుకోవడానికి చూస్తున్నారని ఆరోపించాయి.