Namo - Varanasi: వారణాసిలో వార్ వన్ సైడేనా..? మోదీ మెజారిటీతో గత రికార్డులు గల్లంతేనా.. ?
Namo - Varanasi: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తోన్న వారణాసి ఈ సారి వార్ వన్ సైడేనా ? అంతేకాదు గతంలో ఉన్న మెజారిటీ రికార్డులు ఈ సారి ఎన్నికల్లో గల్లంతవడం ఖాయమేనా అంటే ఔననే అంటున్నాయి బీజేపీ వర్గాలు.
Namo - Varanasi: భారత ప్రధాని మంత్రిగా మూడోసారి నరేంద్ర మోదీ ఎన్నిక అవుతారా లేదా అనేది పక్కన పెడితే.. మెజారిటీ సర్వేలు మరోసారి మోదీనే ప్రధాని పీఠం ఎక్కబోతున్నట్టు అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో కూడా నరేంద్ర మోదీ మూడోసారి వారణాసి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. 2014లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్ధిగా తొలిసారి ఇక్కడ నుంచి బరిలో దిగారు. ఈ నియోజకవర్గంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చెందిన భారతీయ జనతా పార్టీ శ్రేణులు అక్కడ మోహరించారు. అంతేకాదు కాశీలో తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా గణనీయంగా ఉన్నారు. అంతేకాదు ఈ
సారి ఎన్నికల్లో మోదీ గెలవడం నల్లేరు మీద నడకే కానీ.. ఈ సారి అక్కడ భారీ మెజారిటీపైనే కన్నేసింది బీజేపీ హై కమాండ్. అందుకోసం ఇప్పటికే ఓ బృందం పోల్ మేనేజ్‌మెంట్ పై పెద్ద ఎత్తున కసరత్తు నిర్వహిస్తోంది.
ఇక తొలి సాధారణ ఎన్నికల నుంచి 1991 వరకు వారణాసి లోక్‌సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. మధ్యలో జనతా పార్టీ ఇక్కడ విజయ కేతనం ఎగరేసింది. ఇక 1991 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్కడ బోణి కొట్టింది. అప్పటి నుంచి 1991, 1996, 1998, 1999 వరుసగా నాలుగు సార్లు అక్కడ కాషాయ జెండానే ఎగిరింది. కానీ 2004లో మాత్రం వారణాసి సీటు కాంగ్రెస్ వశం అయింది. ఆ తర్వాత 2009 నుంచి 2019 వరకు అక్కడ బీజేపీదే హవా.
2014లో తొలిసారి వారణాసి నుంచి నరేంద్ర మోదీ పోటీ చేసినపుడు 3,71,784 మెజారిటీతో గెలుపొందారు. 2019లో అదే నియోజకవర్గంలో మోదీ 4,79,505 మెజారిటీతో విజయం సాధించారు. 2024లో దేశంలోనే అత్యధిక మెజారిటీతో నరేంద్ర మోదీ విజయం సాధించాలని బీజేపీ ఇప్పటికే అక్కడ వ్యూహం రచించింది. ఇక ఓ సర్వే చెప్పిన వివరాల ప్రకారం గత రెండు దశాబ్దాల్లో ఎక్కువ మెజారిటీ సాధించిన లోక్‌సభ స్థానాల విషయానికొస్తే..ఈ 20 యేళ్లలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నరేంద్రమోదీలు మాత్రమే ఎక్కువ మెజారిటీతో గెలుపొందారని రిపోర్ట్స్ చెబుతున్నాయి. అయితే 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఐదుగురు ఎంపీలు 5,89,000 నుంచి 6,56,000 మెజారిటీతో గెలుపొందారు. వారిలో సంజయ్ భాటియా, సీఆర్ పాటిల్, కిషన్ పాల్, సుభాష్ చంద్ర భదేరియా, రంజన్ బెన్ భట్ వున్నారు. ఇక 2014లో నరేంద్ర మోదీ గుజరాత్‌లోని వడోదరా నుంచి 5,70,000 మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మోదీ తర్వాత స్థానంలో బీజేపీకి చెందిన విజయ్ కుమార్ సింగ్, సిఆర్ పాటిల్, రామ్ చరణ్ బొహ్రా ఎక్కువ మెజారిటీతో గెలుపొందిన ఎంపీలుగా ఉన్నారు.
2009 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించిన 5 గురు లోక్ సభ ఎంపీల్లో ముగ్గురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారున్నారు. వారిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, భూపేందర్ సింగ్ హుడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో ఎక్కువ మెజారిటీ సాధించింది నాగా పీపుల్స్ ఫ్రంట్ క్యాండిడేట్ సి.ఎం.చాంగ్ ఉన్నారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 4,38,000 మెజారిటీ వచ్చింది. విదిశ నుంచి గెలిచిన సుష్మా స్వరాజ్ 3,89,000 మెజారిటీతో రెండో స్థానంలో నిలిచారు.
అందుకే నరేంద్ర మోదీని గతంలో ఏ ప్రధాని సాధించని రికార్డు మెజారిటీతో గెలిపించాలని బీజేపీ శ్రేణులు అక్కడ రాత్రి పగలు కష్టపడుతున్నారు. వారణాసిలో 2 వేలకు పైగా ఆశ్రమాలు..వందల కొద్ది వృద్దాశ్రమాలు.. గురుకులాలు, చిన్న చిన్న గల్లీల్లో నివసించే ప్రజలున్నారు. ఇప్పటికే బీజేపీ అక్కడ వివిధ రాష్ట్రాలకు 50 మందితో అక్కడ పెద్ద టీమ్ ఏర్పాటు చేసింది. వీళ్లందరు వివిధ భాషలు మాట్లాడేవారితో టచ్‌లో ఉన్నారు.
వారాణాసిలో మొత్తం 18 లక్షల ఓటర్లు ఉన్నారు. గతంలో పదిన్నర లక్షల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎపడు అక్కడ పోలింగ్ 60 శాతం దాటింది లేదు. అందుకే ఈ సారి పోలింగ్ శాతం పెంచేలా బీజేపీ శ్రేణులు ప్రత్యక శ్రద్ధ వహిస్తున్నాయి. అంతేకాదు పెరుగుతున్న నోటా ఓట్లపై దృష్టి సారిస్తున్నారు. 2014లో అక్కడ నోటాకు 2 వేలు వచ్చాయి. 2019లో అది 4 వేలకు పెరిగాయి. ప్రధాని పోటీ చేస్తోన్న నియోజకవర్గంలో నోటా ఓట్లు తప్పుడు సంకేతాలు ఇస్తాయని బీజేపీ భావిస్తోంది. ఇలాంటి తిరస్కార ఓట్లు ప్రత్యర్ధి చేతికి ఆయుధం ఇచ్చినట్టే అవుతుందని భావిస్తోంది. వారణాసి.. మోదీ గెలుపు కోసం సునీల్ బన్సల్ మొత్తం బాధ్యతలు తనపై వేసుకున్నారు. అంతా తానై వ్యవహరిస్తున్నారు. మోదీ, షాలకు కళ్లు, చెవుల్లా వ్యవహరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోనే బీజేపీ పోల్ మేనేజమ్మెంట్ వ్వవహారాలను పర్యవేక్షిస్తోంది. మరి జూన్ 1న జరిగే ఎన్నికల్లో వారణాసి ప్రజలు మోదీని ఎంత మెజారిటీతో గెలిపిస్తారనేది తెలియాలంటే జూన్ 4 జరిగే ఎన్నికలు కౌంటింగ్ డే వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read: Police Lathi Charge: రైతులపై లాఠీచార్జ్ చేయడమే మార్పా? కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter