Modi 3.0 Cabinet: కేంద్రలో ఏర్పడుతున్న నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కీలకంగా మారాయి. రెండు రాష్ట్రాల్నించి పెద్దసంఖ్యలో ఎంపీలు గెలవడంతో కేబినెట్‌లో కూడా ఆ మేరకు ప్రాధాన్యత లభిస్తోంది. తెలంగాణ నుంచి ఇద్దరికి, ఏపీ నుంచి ముగ్గురికి ఛాన్స్ లభించనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుని 17 లోక్‌సభ స్థానాల్లో 8 కైవసం చేసుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో కూటమిలోని బీజేపీ 3, జనసేన 2, తెలుగుదేశం 16 స్థానాలు దక్కించుకున్నాయి. అంటే బీజేపీకు రెండు ఏపీ నుంచి 21, తెలంగాణ నుంచి 8 స్థానాలు వచ్చాయి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్నించి 5మందికి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కుతోంది. నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో 30 మందితో మంత్రివర్గం ఏర్పడనుంది. 


నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వంలో


రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జై శంకర్, నిర్మలా సీతారామన్, దర్మేంద్ర ప్రదాన్, పీయూష్ గోయల్ హర్దీప్ సింగ్ పూరీ, జ్యోతిరాదిత్య సింధియా, అశ్వనీ వైష్ణవ్, మన్‌సుఖ్ మాండవియా, సీఆర్ పాటిల్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్ అర్జున్ మేఘవాల్, మనోహర్ లాల్ ఖట్టర్, రావు ఇంద్రజీత్, కమలాజిత్ సెహర్వాత్, భూపేంద్ర యాదవ్, ఎల్ మురుగన్, ప్రహ్లాద్ జోషి, శోభా కర్లాంద్లజే, వి సోమన్నలు ఉన్నారు. 


ఇక తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉన్నారు. ఏపీలో టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి శ్రీనివాస వర్మ ఉన్నారు. 


Also read: PM Modi Oath Ceremony Live Updates: మోదీ ప్రమాణస్వీకారోత్సవం.. కేంద్ర మంత్రుల ఫుల్ లిస్ట్ ఇదే..!



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook