Modi Cabinet List: ఈ రోజు సాయంత్రి 7.15 నిమిషాలకు ఢిల్లీలోని కర్తవ్య పథ్ లో నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతేకాదు మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దాదాపు 60 మంది ఎంపీలు క్యాబినేట్, స్వతంత్ర, సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, బీజేపీ కీలక నేత బీ.ఎల్.సంతోష్ క్యాబినేట్ కూర్పుపై ఓ అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సారి మోడీ క్యాబినేట్ లో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, జై శంకర్, నితిన్ గడ్కరి వంటి నేతలకు తిరిగి క్యాబినేట్ లో కీలక శాఖలు దక్కనున్నాయి. మరోవైపు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఈ సారి క్యాబినేట్ లో చోటు దక్కకపోవచ్చే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమెకు ఏదైనా రాష్ట్రాలనికి గవర్నర్ కు పంపాలనే ఉద్దేశ్యంతో మోడీ ఉన్నట్టు తెలుస్తోంది. నిర్మల సీతారామన్ ప్లేస్ లో పీయూష్ గోయల్ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.


మరోవైపు తెలంగాణ నుంచి ఈ సారి క్యాబినేట్ లో ఇద్దరికి చోటు దక్కే అవకాశాలున్నాయి. బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు తెలంగాణ కోటా నుంచి మోడీ క్యాబినేట్ లో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. వీరికి కేంద్ర సహాయ మంత్రి లేదా స్వతంత్ర హోదాతో కూడిన మంత్రి పదవులు వరించే అవకాశం ఉంది. మరోవైపు బండి సంజయ్ కు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈటలకు వ్యవసాయ లేదా వాణిజ్య పన్నుల శాఖ, ఆరోగ్య శాఖల్లో ఏదైనా కేటాయించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపు తెలంగాణ నుంచి గెలిచిన ఏకైక మహిళా ఎంపీ డీకే అరుణ కూడా క్యాబినేట్ లో చోటు దక్కే అవకాశాలున్నాయి. లేకపోతే ఆమెకు బీజేపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి.


ఇదీ చదవండి: ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావుపై మెగాస్టార్ ట్వీట్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter