భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా సినిమాలు చూస్తారా.. ఈ ప్రశ్న చాలామందికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ఆయన ఆ మధ్యకాలంలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పారు. తాను పెద్దగా సినిమాలు చూడనని.. కాకపోతే యువకుడిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడు మిత్రుల ప్రోద్బలం మేరకు కొన్ని చిత్రాలు చూశానని తెలిపారాయన. అయితే తనకు ఆ సినిమాలు పెద్దగా నచ్చేవి కావని మళ్లీ ఆయనే తెలిపారు. అయితే దేవానంద్ నటించిన "గైడ్" చిత్రం మాత్రం ఎందుకో తనకు నచ్చిందని మోదీయే స్వయంగా తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫిబ్రవరిలో జరిగిన ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ టూరులో మోదీ స్వయంగా పిల్లలతో కలిసి మాట్లాతున్నప్పుడు ఈ విషయాన్ని తెలిపారట. అప్పటికే ఆయన పరీక్షలకు సన్నద్దమవుతున్న పిల్లల కోసం "ఎగ్జామ్ వారియర్స్" అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఆయన పిల్లలు బాగా చదవడానికి కావాల్సిన 25 ప్రధానమైన గుణాలను గురించి విశదీకరించి తెలిపారు. 


[[{"fid":"174243","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక మోదీ గారికి నచ్చిన సినిమా విషయానికి వస్తే.. గైడ్ అనే సినిమా ఆర్కే నారాయణ్ నవలను ఆధారంగా తీసుకొని తెరకెక్కించడం జరిగింది. హిందీతో పాటు ఆంగ్లంలో కూడా ఈ సినిమాను ఒకేసారి తెరకెక్కించారు. అయితే ఆంగ్లంలో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ చిత్రం హిందీలో కాసుల వర్షం కురిపించింది.  విజయానంద్ పఠిష్టమైన చిత్రానువాదం, దర్శకత్వం, కథలో వైవిధ్యం, ఎస్.డి.బర్మన్ సంగీతం, వహీద రెహ్మాన్ నృత్యాలు, దేవానంద్ నటనా కౌశలం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గైడ్ సినిమాలోని పాటలు జనాలను ఉర్రూతలూగించాయి. అయితే ఆ చిత్రకథ రచయితైన ఆర్కే మాత్రం ఈ సినిమా చూసి పెదవి విరిచారు. సినిమాలో కథను కొంత వక్రీకరించారని అసహనం వ్యక్తం చేశారు. అయినా భారతీయ సినిమాలలోని టాప్ టెన్ కళాఖండాల్లో గైడ్ కూడా ఒకటి కావడం విశేషం.