Narendra Modi Oath As Prime Minister: నేడు ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం.. ఎన్నో ప్రత్యేకతలు..
Modi 3.O Cabinet: దేశ వ్యాప్తంగా 2024లో జరిగిన 18వ లోక్ సభకు జరిగి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చింది. ఈ రోజు ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికో ప్రత్యేకత ఉంది.
Modi 3.O Cabinet: 2024 లో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరిగిన ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మూడోసారి ఎన్టీయే కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే జరిగిన బీజేపీ నేతృత్వంలోని ఎన్టీయే కూటమి నేతలు తమ నేతగా నరేంద్ర మోడీని పార్లమెంటరీ పార్టీ నేతగా లోక్ సభ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రోజు నరేంద్ర మోడీతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయంచనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
మోడీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి వివిధ దేశాల అధినేతలతో పాటు 10 వేల మందికి పైగా హాజరు కానున్నారు. కర్తవ్య పథ్ లో మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఇప్పటికే ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగే ప్రాంతాన్ని NSG, SPG తమ అధీనంలోకి తీసుకున్నారు. అంతేకాదు వివిధ దేశాధినేతలు హాజరు కాబోతున్న నేపథ్యంలో 3 వేల మందికి పైగా ఢిల్లీ పోలీసులు, 15 కంపెనీల పారామిలటరీ దళాలు భద్రతను పర్యవేక్షించున్నాయి. అంతేకాదు సభకు చేరుకునే అతిథులు 5 గంటలకు సభ ప్రాంగణానికి చేరుకుంటారు. ప్రమాణ స్వీకారం రాత్రి 7గంటల 15 నిమిషాలకు ప్రారంభమవుతోంది. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛీనయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసే పరిసర ప్రాంతాలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించింది భద్రతా దళాలు.
ఈ ఎన్నికల్లో మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతూ నరేంద్ర మోడీ రికార్డులు నమోదు చేయబోతున్నారు. భారత దేశ తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ తర్వాత వరుస మూడు సార్లు ప్రైమ్ మినిస్టర్ గా స్వీరింగ్ చేస్తూ కొత్త రికార్డు నెలకొల్పనున్నారు.
అప్పట్లో చాచా నెహ్రూ ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రిగా కాకుండా.. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని ప్రభుత్వం నియమిస్తూ వెళ్లింది. కానీ ఆ తర్వాత ప్రజల అభిమానంతో వరుసగా 1952, 1957,1962 ఎన్నికల్లో ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. అప్పట్లో కమ్యూనిష్టులు తప్ప ఎలాంటి ప్రతిపక్షం లేకుండా వరుసగా మూడుసార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.
కానీ నరేంద్ర మోడీ మాత్రం బలమైన ప్రతిపక్షాలను ఢీ కొని 2014,2019,2024 ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాన మంత్రి పీఠంపై కూర్చోబోతున్నారు. అయితే మన దేశంలో నెహ్రూ, నరేంద్ర మోడీ మధ్యలో అటల్ బిహారి వాజ్ పేయ్ మూడు సార్లు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మొదటి సారి 13 రోజులు ప్రభుత్వం.. రెండవ సారి 13 నెలల పాటు అధికారంలో ఉన్నారు. అప్పట్లో జయలలిత కారణంగా ఒక ఒకే ఓటుతో ప్రభుత్వం పతనమైంది. ఆ తర్వాత 1999లో అధికారంలో వచ్చిన పూర్తి స్థాయిలో ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఒక కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఐదేళ్లు పరిపాలన పూర్తి చేసుకున్న నేతగా వాజ్ పేయ్ రికార్డులకు ఎక్కారు. ఏది ఏమైనా మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న భారతీయ జనతా పార్టీకి ఈ సారి ఓటర్లు 240 సీట్లు మాత్రమే ఇచ్చారు. ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత తెలుగు దేశం 16 ఎంపీ సీట్లతో అతిపెద్దగా అవతరించింది. అట జేడీయూ 12 లోక్ సభ సీట్లు.. లోక్ జనశక్తి రాంవిలాస్ పాశ్వాన్ పార్టీకి 5 ఎంపీలు..జనసేన, జేడీయూ పార్టీలకు రెండేసి చొప్పున ఎంపీ సీట్లతో కూటమిలో కీలక నేతలగా ఉన్నారు.
ఇదీ చదవండి:ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం.. రామోజీరావుపై మెగాస్టార్ ట్వీట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter