సిద్ధరామయ్య వివాదంపై విచారణకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్
సిద్ధరామయ్య వివాదంపై విచారణకు ఆదేశించిన జాతీయ మహిళా కమిషన్
న్యూఢిల్లీ: కర్ణాటకలోని మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గంలో జరిగిన ఓ పబ్లిక్ మీటింగ్‌కి హాజరైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుకోకుండా ఓ వివాదంలో చిక్కుకున్నారు. అక్కడ తనను బహిరంగంగా నిలదీసిన ఓ మహిళను వారించే ప్రయత్నంలో ఆమె చేతిలోని మైకును సిద్ధరామయ్య లాక్కుంటుండగానే ఆమె దుపట్టా సైతం కొంత కొంత ముందుకు ఊడి రావడం వివాదాస్పదంగా మారింది.
ఇప్పటికే ఈ వివాదంపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండగా తాజాగా ఈ ఘటనపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. కర్ణాటక రాష్ట్ర డీజీపీ నీలమణి రాజుకు ఓ లేఖ రాశారు. ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా కమిషన్ ఆ లేఖలో పేర్కొన్నట్టుగా ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది.