భారతదేశంలో వైద్య విద్య నియంత్రణ కోసం ప్రస్తుతం ఉన్న ఎంసీఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) స్థానంలో ఒక ప్రత్యేక వైద్య కమీషన్‌ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన బిల్లును శుక్రవారం లోక్ సభలో ప్రవేశబెట్టింది. ఆ బిల్లు ముఖ్యంశాలు ఇవే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

*జాతీయ వైద్య కమీషన్ క్రింద నాలుగు స్వతంత్ర మండలులు ఏర్పాటు చేస్తారు. ఇవి వైద్య విద్యార్థుల వార్షిక పరీక్షల ఏర్పాటుతో పాటు, వైద్య విద్యాసంస్థల
ప్రమాణాలను పరిశీలించడం, వైద్యుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన అంశాలను కూడా పర్యవేక్షిస్తాయి


*ఈ కమీషనుకి సంబంధించి అధ్యక్షుడిని, సభ్యులను ప్రభుత్వమే నియమిస్తుంది


*ఈ కమీషను అమలులోకి వస్తే.. భారతదేశం మొత్తం ఆలిండియాలో వైద్య విద్యార్థులందరికీ ఒకే పరీక్ష నిర్వహిస్తారు


*అలాగే వైద్యులు ప్రాక్టీసు ప్రారంభించే ముందు... లైసెన్స్ పొందడం కోసం మరో పరీక్ష కచ్చితంగా పాస్ అవ్వాలి


*అలాగే ఈ కమీషన్ అమలులోకి వస్తే వైద్య కళాశాలలు కొత్తగా సీట్లు పెంచుకోవాలన్నా.. పీజీ కోర్సులు ప్రారంభించాలన్నా వేరే అనుమతి పొందాల్సిన అవసరం లేదు