కాశ్మీర్‌లో మిలిటెంట్లను మట్టుబెట్టామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ.. అదే ప్రాంతాన్ని హింసా రాజ్యంగా మార్చిన ఘనత కూడా అదే ప్రభుత్వానికి దక్కుతుందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. తాజాగా కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన ట్వీట్లకు బదులిస్తూ ఒమర్ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తన ట్వీట్లలో రవిశంకర్ ప్రసాద్ గణాంకాలను ఇస్తూ యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2012లో 72 మిలిటెంట్లను, 2013లో 67 మిలిటెంట్లను మట్టుబెడితే.. ఎన్డీఏ ప్రభుత్వం 2014లో 110 మంది మిలిటెంట్లను మట్టుబెట్టిందని తెలిపారు.


అయితే ఈ ట్వీట్ పై ఒమర్ అబ్దుల్లా ఘాటుగానే స్పందించారు. మిలిటెంట్లను చంపడమనే విషయాన్ని గొప్ప విజయం సాధించిన విషయంగా చెప్పుకోకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. కాశ్మీరులో శాంతిభద్రతలను కాపాడడంలో కేంద్ర ప్రభుత్వం ఫెయిల్ అవుతోందని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.