Neeraj Chopra's javelin gets highest bid during e-auction of PM Modi's gifts: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి (Prime Minister Narendra Modi) వచ్చిన బహుమతుల ఈ-వేలంలో భాగంగా నీరజ్‌కు, దేశానికి పసిడి పతకాన్ని (gold medal) అందించిన ఈటెను వేలానికి పెట్టగా భారీ ధర పలికింది. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించిన జావెలిన్‌ త్రో (javelin throw) అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా (neeraj chopra) ఉపయోగించిన ఈటె రూ.కోటిన్నర ధర పలికింది. టోక్యో ఒలింపిక్స్‌, (tokyo olympics) పారాలింపిక్స్‌లో భారత్‌ తరపున అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లు ప్రధానికి గిఫ్ట్స్ గా వచ్చిన క్రీడా పరికరాలను ఆయనకు వివిధ సందర్భాల్లో వచ్చిన జ్ఞాపికలను ఆన్‌లైన్‌ వేదికగా వేలం వేశారు. కేంద్ర సాంస్కృతిక శాఖ pmmementos.gov.inలో ఈ వేలాన్ని నిర్వహించింది. మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబరు 17న మొదలైన ఈ-వేలం అక్టోబరు 7 గురువారంతో ముగిసింది. ఇక రెండు ఒలింపిక్స్‌ పతకాలు సాధించిన భారత తొలి మహిళగా నిలిచిన భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు (pv sindhu) రాకెట్‌ కూడా మంచి ధర పలికింది. పీవీ సింధు రాకెట్‌కు రూ.80,00,100 ధర లభించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వేలంలో నీరజ్‌ (neeraj) ఈటె.. రూ.1.5కోట్లకు అమ్ముడై అత్యధిక ధర పలికింది. అయితే దీన్ని ఎవరు కొనుగోలు చేశారన్నది సాంస్కృతిక శాఖ ఇంకా బయట పెట్టలేదు. అయితే వేలం ప్రారంభమైన రోజే నీరజ్‌ ఈటె (javelin) రూ.10 కోట్ల ధర పలికినప్పటికీ ఆ బిడ్‌ నకిలీదనే అనుమానంతో తొలగించారు.


Also Read: MLA Malladi Vishnu: మళ్లీ నోరు జారిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు.. ఈ సారి భక్తులపై..


టోక్యో ఒలింపిక్స్‌లో (tokyo olympics) భారత్‌ తరఫున ఫెన్సింగ్‌లో పోటీ పడ్డ ఫెన్సర్‌ భవానీదేవి (bhavani devi) కత్తికి ఈ-వేలంలో మంచి ధర వచ్చింది. రూ.1.25కోట్ల ధర లభించింది. అలాగే పారాలింపిక్స్‌లో పసిడి సాధించిన సుమిత్‌ బళ్లెం రూ. రూ.కోటి 25వేలు పలికింది. పారాలింపిక్స్‌ విజేతలు సంతకాలు చేసి ప్రధానికి బహూకరించిన కండువా రూ.కోటి పలికింది. టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ సంచలనం లవ్లీనా బోర్గొహేన్‌ (lovlina borgohain) చేతి గ్లౌజులు రూ.91లక్షల ధర పలికాయి.


ఇక క్రీడాకారులు క్రీడా పరికరాలతో పాటు మోదీకి (Modi) జ్ఞాపికలు, బహుమతులను కూడా వేలం వేశారు. మోదీ దగ్గరున్న మొత్తం 1348 వస్తువులను ఈ-వేలానికి ఉంచారు. వీటికి 8600 బిడ్లు వచ్చాయి. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన నిధులన్నింటినీ గంగా నది ప్రక్షాళన కోసం చేపట్టిన నమామి గంగే (namami gange) కార్యక్రమం కోసం ఖర్చు చేయనున్నారు.


Also Read: Telangana Assembly live video: కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్, ఫ‌స‌ల్ బీమా వ‌ట్టి బోగ‌స్ అంటూ ధ్వజం, కౌలు రైతులను పట్టించుకోం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook