నీట్‌ -2018 పరీక్షల ప్రకటనను సిబిఎస్‌ఇ గురువారం విడుదల చేసింది. మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష  (నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్టు‌-2018)ను మే నెల 6వ తేదీన నిర్వహిస్తామని తెలిపింది. ఈ క్రమంలో భారతదేశంలో గల వివిధ వైద్య, దంత కళాశాలల్లో ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ కోర్సుల్లో ప్రవేశించే విద్యార్థులు నీట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌ జారీచేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పరీక్షను హిందీ, ఆంగ్లభాషలతో పాటు తెలుగు, గుజరాతీ, తమిళం, కన్నడ, మరాఠీ, ఒరియా, బెంగాలీ, అస్సామీ భాషల్లో కూడా నిర్వహిస్తామని సీబీఎస్‌ఈ తెలిపింది. ఎన్నారై విద్యార్థులు కూడా ఈ పరీక్ష  రాయవచ్చని.. అందుకు సంబంధించిన వివరాలు అధికార వెబ్‌సైట్‌లో పొంచుపరిచామని సీబీఎస్‌ తెలిపింది.


ఒసి, ఒబిసి, విద్యార్థులు రూ.1400, ఎస్సి, ఎస్‌టి విద్యార్థులు రూ. 750 ఎంట్రన్స్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని సీబీఎస్‌ఈ ప్రకటనలో తెలిపింది. అయితే ఓపెన్ స్కూలు లేదా ప్రైవేటుగా ఇంటర్ పాసైన వారు నీట్ 2018 రాయడానికి అనర్హులు అని సీబీఎస్‌ఈ తెలపడం గమనార్హం.