Reappearing Chance For NEET: నీట్ పరీక్ష సందర్భంగా విద్యార్థినుల 'లోదుస్తులు' విప్పించిన ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేరళలోని కొల్లాంలో ఉన్న మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పరీక్షా కేంద్రంలోకి అనుమతించేందుకు లోదుస్తులు విప్పించారని దాదాపు 100 మంది విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఘటనతో తీవ్రంగా డిస్టర్బ్ అయ్యామని.. పరీక్ష సరిగా రాయలేకపోయామని వాపోయారు. ఆ విద్యార్థినులందరికీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోదుస్తులు విప్పించడంతో మనోవేదనకు గురై పరీక్ష సరిగా రాయలేకపోయిన విద్యార్థినులకు మరోసారి పరీక్ష రాసే అవకాశాన్ని ఎన్‌టీఏ కల్పిస్తోంది. సెప్టెంబర్ 4న వీరికి పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్‌టీఏ మెయిల్ ద్వారా విద్యార్థినులకు సమాచారం అందించింది. ఎన్‌టీఏ తాజా నిర్ణయం పట్ల విద్యార్థినులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


అసలేంటీ వివాదం :


దేశవ్యాప్తంగా ఈ ఏడాది జూలై 17న నీట్ యూజీ పరీక్ష జరిగింది. నీట్ పరీక్షా కేంద్రమైన కేరళ మార్థోమా ఇన్‌స్టిట్యూట్‌లో అక్కడి సిబ్బంది విద్యార్థినుల పట్ల అగౌరవంగా, అమర్యాదగా వ్యవహరించారు. నీట్ డ్రెస్ కోడ్‌ గైడ్ లైన్స్‌లో లేకపోయినప్పటికీ లోదుస్తుల (బ్రా)కు మెటల్ హుక్ ఉందనే కారణంతో లోపలికి అనుమతించలేదు. 


లోదుస్తులను తొలగిస్తేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామని చెప్పడంతో విద్యార్థినులు అలా చేయక తప్పలేదు. అయితే ఈ ఘటనతో తాము చాలా డిస్టర్బ్ అయ్యామని.. పరీక్ష సరిగా రాయలేక నష్టపోయామని విద్యార్థినులు వాపోయారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం, మానవ హక్కుల కమిషన్ సైతం విచారణకు ఆదేశించడం, పలువురిని అరెస్ట్ చేయడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ విద్యార్థినులకు మరోసారి నీట్ రాసే అవకాశాన్ని కల్పించాలని ఎన్‌టీఏ నిర్ణయించింది.


Also Read: Neet Dress Code: నా కూతురి లోదుస్తులు విప్పించారు.. నీట్ పరీక్షలో డ్రెస్ కోడ్‌పై పోలీసులకు ఓ తండ్రి ఫిర్యాదు..


Also Read: Neet Dress Code: లోదుస్తులు చేతుల్లోనే పట్టుకుని వెళ్లమన్నారు.. బాధిత విద్యార్థిని ఆవేదన.. ఐదుగురు మహిళా సిబ్బంది అరెస్ట్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook