NEET PG 2024 Exam Dates: నీట్ పీజీ 2024 పరీక్ష కొత్త ఫార్మట్‌లో నిర్వహణ, కొత్త విధానంపై అభ్యంతరాలు, పరీక్ష ఎప్పుడంటే
NEET PG 2024 Exam Dates: దేశవ్యాప్తంగా నీట్ 2024 నిర్వహణ వివాదాస్పదమైంది. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో వాయిదా పడిన నీట్ పీజీ 2024 పరీక్షల కొత్త తేదీలు ప్రకటించింది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్. అంతేకాకుండా ఈసారి పరీక్ష కూడా కొత్త మోడల్లో జరగనుంది.
NEET PG 2024 Exam Dates: NEET UG 2024 పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజ్, గ్రేస్ మార్కుల వివాదం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై ఆరోపణల నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా వాయిదా పడిన నీట్ యూజీ 2024 పరీక్ష కొత్త తేదీలు ఖరారయ్యాయి. ఈసారి నీట్ పీజీ 2024 పరీక్షను రెండు దశల్లో, కొత్త Nఫార్మట్‌లో నిర్వహించనున్నారు.
నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన యూజీసీ నెట్ పరీక్ష కూడా లీకేజ్ కారణంగా రద్దయింది. ఈ క్రమంలోనే జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ 2024 పరీక్ష వాయిదా పడింది. జూలై 2వ తేదీనే కొత్త తేదీల్ని ప్రకటించాల్సి ఉన్నా కేంద్రం నుంచి ఆమోదం లభించకపోవడంతో ఆలస్యమైంది. ఇప్పుడు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఆమోదంతో నీట్ పీజీ 2024 పరీక్షకు కొత్త తేదీలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ ప్రకటించింది. ఈసారి పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు కేవలం 2 గంటల ముందే ప్రశ్నాపత్రాన్ని సిద్ధం చేయనున్నారు. మరోవైపు రెండు దశల్లో కొత్త ఫార్మట్‌లో పరీక్ష ఉంటుంద.
వాయిదా పడిన నీట్ పీజీ 2024 పరీక్ష ఆగస్టు 11న జరగనుంది. ఉదయం, మద్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. కొత్త ఫార్మట్ ప్రకారం ప్రశ్నాపత్రం పలు విభాగాల్లో ఉంటుంది. ప్రతి విభాగానికి నిర్ణీత సమయం ఉంటుంది. ఓ విభాగానికి కేటాయించిన సమయం పూర్తయ్యాకే రెండో విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. ఓ విభాగం సమయం పూర్తయ్యాక ప్రశ్నలు సమీక్షించేందుకు లేదా సవరణకు వీలుండదు. ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారా లేదా అనే అంశంతో సంబంధం లేకుండా మరో ప్రశ్నకు మార్క్ చేయవచ్చు. ఫలితంగా సమయంలోగా మార్క్ చేసిన ప్రశ్నల్ని మరోసారి చూసుకునేందుకు వీలుంటుంది.
కొత్త ఫార్మట్ కాస్త కష్టమే
కొత్త ఫార్మట్ కాస్త సంక్లిష్టంగానే ఉందని తెలుస్తోంది. విద్యార్ధులు ఆన్సర్ చేసిన ప్రశ్నల్ని సమీక్షించుకునే అవకాశం లేకపోవడం, ప్రతి విభాగానికి ప్రత్యేకంగా సమయం కేటాయించడం అనేది విద్యార్ధులకు ఇబ్బందికర పరిణామమే. ఎందుకంటే సాధారణంగా కొన్ని విభాగాలు కొందరు విద్యార్ధులకు సులువుగా ఉండవచ్చు. దాంతో సులువుగా ఉన్న విభాగం ప్రశ్నలు త్వరగా ఆన్సర్ చేసి మిగిలిన ఆ సమయాన్ని మరో విభాగానికి వినియోగించుకునేలా ఉంటే విద్యార్ధులకు ఉపయోగం ఉంటుంది. అలా కాకుండా కొత్త ఫార్మట్ ప్రకారం ఓ విభాగం సమయం పూర్తయ్యాకే రెండో విభాగానికి వెళ్లడం అంటే సమయం మిగిలినా వృధా అవుతుంది.
నీట్ పీజీ పరీక్షల ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 6,102 ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల భర్తీ జరగనుంది. ఇందులో 26,168 ఎండీ సీట్లు, 13,649 ఎంఎస్, 922 పీజీ డిప్లొమో సీట్లున్నాయి.
Also read: Bhole baba Properties: వామ్మో.. భోలే బాబాకు అన్ని కోట్ల ఆస్తులు, కళ్లు చెదిరే బంగ్లాలున్నాయా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook