NEET UG 2022 RESULT : నీట్ యూజీ 2022 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఫలితాలను ప్రకటిస్తుంది. నీట్ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో ఫలితాలను అందుబాటులో ఉంచుతారు. ఫలితాలు వెలువడిన కొద్ది గంటలకు 'ఫైనల్ ఆన్సర్ కీ'ని కూడా పీడీఎఫ్ రూపంలో నీట్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట్ ఫలితాలు ఈ వెబ్‌సైట్స్‌లో 


nta.ac.in
neet.nta.nic.in 


నీట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి :


మొదట  neet.nta.nic.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి
హోంపేజీలో '“Download NEET UG Result 2022' ఆప్షన్‌పై క్లిక్ చేయండి
స్క్రీన్‌పై కనిపిస్తున్న బాక్స్‌లో మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేసి సబ్‌మిట్ ఆప్షన్ నొక్కండి
అంతే.. స్క్రీన్‌పై మీ ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి
స్కోర్ కార్డును ప్రింటవుట్ తీసి ఉంచుకోండి


నీట్ అధికారిక ఆన్సర్ 'కీ'ని ఎన్‌టీఏ ఆగస్టు 31న విడుదల చేసింది.  అభ్యంతరాలకు సెప్టెంబర్ 2 వరకు గడువు ఇచ్చింది. తాజాగా ఫలితాలను విడుదల చేయనుంది. విద్యార్థులు తమ స్కోర్ కార్డులో వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. రోల్ నంబర్, అప్లికేషన్ నంబర్, వ్యక్తిగత వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అలాగే, ఓవరాల్ మార్క్స్, నీట్ ఆల్ ఇండియా ర్యాంక్, క్వాలిఫయింగ్ స్టేటస్, కటాఫ్ స్కోర్స్‌ను వెరిఫై చేసుకోవాలి.


నీట్ ద్వారా విద్యార్థులు దేశంలోని యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్స్‌లో మెడికల్ కోర్సుల్లో ప్రవేశం పొందుతారు. నీట్ స్కోర్‌కి కేవలం ఏడాది పాటే వాలిడిటీ ఉంటుంది. అయితే ఇంటర్నేషనల్ కాలేజీల్లో ప్రవేశాలకు దీని వాలిడిటీ మూడేళ్ల పాటు ఉంటుంది. నీట్‌లో క్వాలిఫై కాని విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశం పొందలేరు. వారు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ (ఫిజియోథెరపీ), బీఓటీ (ఆక్యుపేషనల్ థెరపీ)తదిర కోర్సులకు అప్లై చేసుకోవచ్చు.


ఈ ఏడాది జూలై 17న నిర్వహించిన నీట్ పరీక్షకు దాదాపు 18 లక్షల మంది హాజరయ్యారు. వీరిలో 8,07,541 మంది అబ్బాయిలు, 10,64,791 మంది అమ్మాయిలు, ట్రాన్స్ జెండర్స్ 11 మంది ఉన్నారు. ఫలితాల కోసం వీరంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 


Also Read: Horoscope Today September 7th 2022: నేటి రాశి ఫలాలు... ఈ రాశి వారి కెరీర్‌లో ఇవాళ కీలక పరిణామం..


Also Read: TRS MLC Kavitha: నిజామాబాద్ సభలో ఎమ్మెల్సీ కవిత మౌనం వెనుకున్న కారణం ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook