NEET UG 2024 Issue: నీట్ అక్రమాలకు నిరసనగా జూలై 4న దేశవ్యాప్త బంద్
Schools & Colleges Bandh: దేశవ్యాప్తంగా నీట్ 2024పై చర్చ జరుగుతోంది. నీట్ 2024 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్, అవకతవకలు, సీబీఐ దర్యాప్తుతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే జూలై 4న దేశవ్యాప్త బంద్‌కు విద్యార్ధి సంఘాలు పిలుపునిచ్చాయి.
Schools & Colleges Bandh: NEET UG 2024 పరీక్షలో భారీగా అవకతవకలు జరిగాయి. గ్రేస్ మార్కుల గందరగోళం చెలరేగింది. ప్రశ్నాపత్రం లీకైంది. సీబీఐ దర్యాప్తు, విద్యార్ధుల అరెస్ట్ కొనసాగుతోంది. మరోవైపు నీట్ పరీక్ష రద్దు కోరుతూ విద్యార్ధి సంఘాలు ఉద్యమిస్తున్నాయి. జూలై 4న దేశవ్యాప్త బంద్‌కు నిర్ణయించాయి.
నీట్ 2024 అక్రమాలు, పేపర్ లీకేజ్ ఘటనలపై అరెస్టులు కొనసాగుతున్నాయి. 13 మందిని బీహార్ పోలీస్ ఆర్ధిక నేరాల విభాగం అరెస్టు చేయగా మరో ఏడుగురిని సీబీఐ అరెస్టు చేసింది. బీహార్ పోలీసులు అరెస్టు చేసిన 13 మందిని ప్రశ్నించేందుకు కోర్టు అనుమతి కోరింది సీబీఐ. ఈ 13 మందిలో ఆరుగురు ప్రశ్నాపత్రం లీకేజ్ మాఫియాలో భాగంగా కాగా మరో నలుగురు తల్లిదండ్రులున్నారు. ఇక సీబీఐ రిమాండ్‌లో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎహ్సానుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ అహ్మద్, ఓ జర్నలిస్టు ఉన్నారు. వీరిపై ప్రశ్నాపత్రాల తారుమారు ఆరోపణలున్నాయి.
నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. నీట్ 2024 రద్దు చేయాలని దేశవ్యాప్తంగా పలు విద్యార్ధి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. పరీక్ష రద్దుకు సుప్రీంకోర్టు అభిముఖంగా లేనట్టుగా తెలుస్తోంది. నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా విద్యార్ధి సంఘాలు దేశవ్యాప్తంగా జూలై 4న బంద్ చేసేందుకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల లక్షలాది విద్యార్ధుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపి, ఐఐటీ ప్రవేశాల్లో రాజకీయ జోక్యం నివారించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశంపై లోక్‌సభలో ప్రతిపక్షాలు అదికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
Also read: Reliance Jio New Plans: జియో నుంచి మల్టీ లాంగ్వేజ్ యాప్ సహా కొత్త అన్‌లిమిటెడ్ ప్లాన్స్ లాంచ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook