NEET 2024 Paper Leak: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతి యేటా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2024 పరీక్ష నిన్న ఆదివారం జరిగింది. దేశవ్యాప్తంగా 557 నగరాల్లోనూ, విదేశాల్లో 14 నగరాల్లోనూ నీట్ పరీక్ష జరిగింది. అయితే రాజస్థాన్‌లోని ఓ సెంటర్ లో ప్రశ్నాపత్రం లీక్ అయినట్టు వార్తలు రావడంతో ఆందోళన రేగింది. ఎన్టీఏ దీనిపై క్లారిటీ ఇచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశవ్యాప్తంగా 23 లక్షల 81 వేల మంది నీట్ 2024 పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 10 లక్షల మంది అబ్బాయిలు కాగా, 13 లక్షల మంది అమ్మాయిలున్నారు. ఇక 24 మంది ధర్డ్ జెండర్ విద్యార్ధులున్నారు. నిన్న మే 5వ తేదీ మద్యాహ్నం 2 గంటల్నించి 5.20 గంటల వరకూ నీట్ పరీక్ష జరిగింది. అయితే పరీక్ష ముగిసిన కాస్సేపటికి పేపర్ లీక్ అయినట్టుగా వార్తలు వ్యాపించాయి. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో హిందీ మీడియం విద్యార్ధులకు ఇంగ్లీషు మీడియం ప్రశ్నాపత్రాలిచ్చారు. జరిగిన పొరపాటును అక్కడున్న ఇన్విజిలేటర్ సరిదిద్దేలోగా విద్యార్ధులు బలవంతంగా పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. నిబంధనల ప్రకారం విద్యార్ధులు అలా వెళ్లకూడదు. పరీక్ష ముగిసిన తరువాతే వెళ్లాలి. దాంతో ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైందని, పేపర్ మాత్రం లీక్ కాలేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. 


రాజస్థాన్‌లో జరిగిన ఈ పొరపాటుపై చర్యలు తీసుకోనున్నట్టు ఎన్టీఏ ప్రకటించింది. అంతేకాకుండా ఆ సెంటర్‌లోని 120 మంది విద్యార్ధులకు మళ్లీ పరీక్ష నిర్వహించే ఆలోచనలే ఎన్టీఏ ఉంది. బాధిత విద్యార్ధులకు మరో తేదీలో నీట్ పరీక్ష నిర్వహించవచ్చు. 


Also read: Apple Watch Saves Life: ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈవో రెస్పాన్స్ ఏంటో తెలుసా..?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook