NEET UG 2024 Last Date: దేశంలోని వైద్య కళాశాలల్లో ప్రవేశానికి ప్రతి యేటా నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తులు ఈసారి వెల్లువలా వచ్చిపడుతున్నాయి. నీట్ యూజీ 2024 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును మార్చ్ 16 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. నీట్ 2024కు దరఖాస్తు చేయలేనివారికి మరో అద్భుత అవకాశమిది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతియేటా నీట్ పరీక్ష నిర్వహిస్తుంటుంది. నీట్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశం ఉంటుంది. దేశవ్యాప్తంగా మే 5వ తేదీన నీట్ యూజీ 2024 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షపై ప్రస్తుతం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వాస్తవానికి దరఖాస్తు చేసేందుకు గడువు మార్చ్ 9వ తేదీతో ముగిసింది. కానీ దేశవ్యాప్తంగా వచ్చిన అభ్యర్ధనల మేరకు మరో వారం రోజులు అంటే మార్చ్ 16 వరకూ పొడిగించారు. ఇప్పటి వరకూ2 5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు తెలుస్తోంది. 


నీట్ పరీక్ష మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. నీట్ పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో జరిగే పరీక్ష. మే 5 వతేదీ మద్యాహ్నం 2 గంటల్నించి సాయంత్రం 5.20 గంటల వరకూ పరీక్ష ఉంటుంది. ఫలితాలు జూన్ 14న వెల్లడిస్తారు. అభ్యర్ధుల వయస్సు 17 ఏళ్లు మించి ఉండాలి. గరిష్టంగా ఎంతైనా ఉండవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, బయో టెక్నాలజీ సైన్స్‌లో ఇంటర్ లేదా సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్ కేటగరీ విద్యార్ధులు 1700 రూపాయలు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్‌సీఎల్ విద్యార్ధులు 1600 రూపాయలు, ఎస్సీ-ఎస్టీ-పీడబ్ల్యూడీ-థర్డ్ జెండర్ విద్యార్ధులు 100 రూపాయలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. 


Also read: Vande Bharat Sleeper Trains: నిర్మాణం పూర్తి చేసుకున్న వందేభారత్ స్లీపర్ రైళ్లు, త్వరలోనే ప్రారంభం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook