NEET UG 2024 Revised Results: ఎన్నో వివాదాలు, పేపర్ లీక్ ఘటనలు, గ్రేస్ మార్కుల అవకతవకలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లోపభూయిష్ట విధానాల మద్య వివాదాస్పదంగా మారిన NEET UG 2024 అంశానికి తెరపడింది. మరోసారి రివైజ్ చేసిన ఫలితాల ప్రకటనతో నీట్ టాప్ ర్యాంకర్ల జాబితా 17కు పడిపోయింది. దీనికి సంబంధించిన రివైజ్డ్ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, అడ్మిషన్ల ప్రక్రియ ఎలా ఉంటుందనే వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట్ యూజీ 2024 వివాదంపై సుప్రీంకోర్టు రీ టెస్ట్ సాద్యం కాదని తేల్చిచెప్పింది. ఫిజిక్స్ ప్రశ్నకు ఢిల్లీ ఐఐటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సరైన సమాధానం సూచించింది. ఆ తరవాత ఫలితాలను రివైజ్ చేసి ప్రకటించాలని ఆదేశించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరోసారి రిజల్ట్స్ డిక్లేర్ చేసింది. నీట్ ఫలితాలు ప్రకటించడం ఇది నాలుగసారి. మే 4వ తేదీన పరీక్ష జరిగిన తరువాత తొలిసారి జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఆ తరువాత గ్రేస్ మార్కులు తొలగించి జూన్ 30న రెండోసారి ఫలితాలు విడుదలయ్యాయి. జూలై 20న మూడోసారి విడుదల కాగా జూలై 27న చివరి సారిగా ఫలితాలు రివైజ్ అయ్యాయి. నీట్ చరిత్రలో నాలుగుసార్ల ఫలితాలు విడుదల కావడం ఇదే తొలిసారి. 


నీట్ యూజీ 2024 ఫలితాల్లో మొదటి ర్యాంక్ మొదటిసారి 67 మంది పంచుకోగా గ్రేస్ మార్కుల వివాదం అనంతరం ఆరుగురిని ఆ జాబితా నుంచి తొలగించి 61 మందికి ర్యాంకులు ప్రకటించింది. అంటే 720 ఫుల్ మార్కులు పొందినవారి సంఖ్య 61 అయింది. ఇక ఫిజిక్స్ విభాగంలో ఓ ప్రశ్నకు రెండు సమాధానాల విషయంలో తలెత్తిన వివాదానికి ఐఐటీ ఢిల్లీ సహాయంతో పరిష్కారం లభించింది. ఆ ప్రశ్నకు రెండు సమాధానాలు సరైంది కాదని ఒకే సమాధానముందని కమిటీ సూచించడంతో రెండో సమాధానం ఎంపిక చేసుకున్నవారికి 4 మార్కుల్ని తొలగించింది ఎన్టీయే. దాంతో ఏకంగా 44 మంది ఫుల్ మార్కులు కోల్పోయి 720 ఫుల్ మార్కులు పొందినవారు 17కు పరిమితమయ్యాయు. ఈ సవరించిన ర్యాంకులతో మొత్తం ఫలితాలు ఎన్టీఏ రివైజ్ చేసి ప్రకటించింది.


నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాల అనంతరం టాపర్ల జాబితా


మృదుల్ మాన్య ఆనందం, ఢిల్లీ
ఆయుష్ నౌగ్రియా, ఉత్తరప్రదేశ్
మాజిన్ మన్సూర్, బీహార్
ప్రచిత, రాజస్థాన్
సౌరవ్, రాజస్థాన్
దివ్యాంశ్, ఢిల్లీ
గున్మయ్ గార్గ్, పంజాబ్
అర్ఘ్యాదీప్  దత్తా, పశ్చిమ బెంగాల్
శుభన్ సేన్ గుప్తా, మహారాష్ట్ర
ఆర్యన్ యాదవ్, ఉత్తర ప్రదేశ్
పలాన్ష అగర్వాల్, మహారాష్ట్ర
రజనీష్,తమిళనాడు
శ్రీనంద్ షర్మిల్, కేరళ
మానే నేహా కుల్దీప్, మహారాష్ట్ర
తైజాస్ సింగ్, చండీగడ్
దేవేష్ జోషి, రాజస్థాన్
ఇరమ్ ఖాజి, రాజస్థాన్


నీట్ యూజీ తుది ఫలితాలు విడుదల కావడంతో ఇక మెడికల్ కౌన్సిలింగ్ ప్రారంభం కావల్సి ఉంది. మెడికల్ కౌన్సిల్ కమిటీ ఆగస్టు మొదటి వారంలో కౌన్సిలింగ్ ప్రారంభించనుందని తెలుస్తోంది. కౌన్సిలింగ్ తేదీ, షెడ్యూల్ వంటి పూర్తి వివరాలు వైద్య ఆరోగ్య శాఖ, వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖల డైరెక్టరేట్ల వెబ్ సైట్స్ లో అందుబాటులో ఉండనుంది. నీట్ యూజీ 2024 రివైజ్డ్ ఫలితాలను exams.nta.ac.in/NEET ద్వారా చెక్ చేసుకోవాలి.


Also read: SSC Recruitment 2024: స్టాఫ్ సెలక్షన్‌ కమిషన్ స్టెనోగ్రాఫర్‌ నోటిఫికేషన్‌ విడుదల.. అర్హత ఇతర వివరాలు తెలుసుకోండి..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook