NEET 2024 Row: నీట్ 2024 గ్రేస్ మార్కుల విషయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. వివాదాస్పదంగా మారిన గ్రేస్ మార్కుల వ్యవహారంపై వెనక్కి తగ్గింది. దేశంలోని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో గ్రేస్ మార్కుల్ని తొలగిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NEET UG 2024 పరీక్ష ఈసారి వివాదాస్పదమైంది. నీట్ యూజీ 2024 పరీక్ష మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరుగగా దాదాపు 24 లక్షలమంది పరీక్ష రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 67 మందికి 720 పుల్ మార్కులు వచ్చేశాయి. అది కూడా ఒకే పరీక్షా కేంద్రం నుంచి ఆరుగురు విద్యార్ధులకు మొదటి ర్యాంక్ రావడం అనుమానాలకు దారి తీసింది. ఇంకోవైపు నిబంధనలు, ఫార్మట్‌కు విరుద్ఘంగా కొందరికి 718, 719 మార్కులొచ్చాయి. అయితే 1563 మందికి సాంకేతీక కారణాలతో గ్రేస్ మార్కులు కలిపామంటూ ఎన్టీఏ వివరణ ఇచ్చింది. నీట్‌లో జరిగిన అక్రమాల్ని ప్రశ్నిస్తూ కొందరు విద్యార్ధులకు ర్యాండమ్‌గా 70-80 మార్కులు కలిపారని, ఏ పాలసీ ప్రకారం చేశారో చెప్పాలని ఫిజిక్స్ వాలా వ్యవస్థాపకుడు అలఖ్ పాండే సుప్రీంకోర్టును ఆశ్రయించటారు. మరోవైపు కౌన్సిలింగ్ నిలిపివేయాలని మరో రెండు పిటీషన్లు దాఖలయ్యాయి. 


ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కౌన్సిలింగ్ నిలిపివేసేందుకు నిరాకరించింది. అయితే గ్రేస్ మార్కుల విషయంలో కోర్టు నిలదీయడంతో ఆ మార్కుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. గ్రేస్ మార్కుల్ని వెనక్కి తీసుకుని ఆ 1563 మందికి మరోసారి ఈ నెల 23 న పరీక్ష నిర్వహించి 30వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని ఎన్టీయే సుప్రీంకోర్టుకు నివేదించింది. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూస్తామని తెలిపింది. 


ఇదే అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పందించారు. నీట్ యూజీ 2024 పరీక్షలో అవకతవకలకు పాల్పడినవారిపై కఠిన చర్చలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. గ్రేస్ మార్కులు తొలగించిన 1563 మందికి మరోసారి పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 


Also read: No Fastags: ఫాస్టాగ్‌కు చెల్లుచీటీ, ఇకపై నో టోల్‌ప్లాజా, త్వరలో కొత్త విధానం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook