NEET 2024: రేపే నీట్ 2024 పరీక్ష, విద్యార్ధులు తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు
NEET 2024: దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశానికే నిర్వహించే NEET 2024 రేపు జరగనుంది. రేపు అంటే మే 5న జరిగే ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. నీట్ పరీక్ష రాసే విద్యార్ధులు తప్పకుండా పాటించాల్సిన మార్గదర్శకాలు
NEET 2024: నీట్ యూజీ 2024 పరీక్ష రేపు దేశవ్యాప్తంగా జరగనుంది. ఈ ఏడాది నీట్ పరీక్షకు 23, 81,833 మంది దరఖాస్తు చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, బీహెచ్ఎంఎస్, బీఎస్ఎంఎస్, బీయూఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షను నిర్వహిస్తుంటుంది.
నీట్ యూజీ 2024 విద్యార్ధులకు ముఖ్య సూచనలు
విద్యార్ధులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో తప్పకుండా తీసుకెళ్లాలి. హాజరుపత్రంపై ఫోటో ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. డ్రెస్ కోడ్ తప్పనిసరిగా పాటించాలి. పొడవైన చేతులున్న దుస్తులు, బూట్లు, నగలు, మెటల్ వస్తువులకు అనుమతి లేదు. అందుకే మీరు ధరించే దుస్తుల్లో మెటల్ వస్తువుల్లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. లో హైట్ చెప్పులు మాత్రమే ధరించాలి.
పేపర్లు, జామెట్రీ బాక్స్, పెన్సిల్ బాక్స్, ప్లాస్టిక్ పౌచ్, కాలిక్యులేటర్లు, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, ఎలక్ట్రానిక్ పెన్నులు అనుమతించరు. వాచెస్, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, బెల్టులు, టోపీలు ధరించరాదు.
నీట్ యూజీ 2024 పరీక్ష విధానం
నీట్ పరీక్ష పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి 3 గంటల 20 నిమిషాలుంటుంది. ప్రతి సబ్జెక్టు నుంచి గరిష్టంగా 45 ప్రశ్నలతో 180 ఆబ్జెక్టివ్ ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ అంశాలుంటాయి.
సెక్షన్ ఎ, సెక్షన్ బి నుంచి 50 ప్రశ్నలుంటే ఇందులో సెక్షన్ ఎ నుంచి 35, సెక్షన్ బి నుంచి 15 ఉంటాయి. సెక్షన్ బిలో ఇచ్చే 15 ప్రశ్నల్లో 10 మాత్రమే సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మల్టిపుల్ ఛాయిస్ 4 ఉంటాయి. సరైన సమాధానానికి 4 మార్కులుంటాయి. రాంగ్ ఆన్సర్ అయితే 1 మార్కు మైనస్ అవుతుంది. ఇలా మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో బయోలజీ 360 మార్కులకు కాగా, ఫిజిక్స్ 180, కెమిస్ట్రీ 180 మార్కులకు ఉంటుంది.
Also read: Sucharita Mohanty: కాంగ్రెస్ కు బిగ్ షాక్.. టికెట్ వెనక్కు ఇచ్చేసిన ఎంపీ అభ్యర్థి.. కారణం ఏంటంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook