భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ పశు మాంసం (బీఫ్‌), పంది మాంసం తినేవారని ఆయన పండిట్ కాదని రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్‌దేవ్‌ అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్వార్‌లో  మీడియాతో మాట్లాడిన ఆయన..  ‘నెహ్రూ పండిట్‌ కాదు. ఆయన బీఫ్‌, పందిమాంసం తినేవారు. ఇవి తినేవారిని పండిట్‌  అని ఎలా పిలుస్తారు? కేవలం ఓట్ల కోసమే కాంగ్రెస్‌  నెహ్రూ పేరు ముందు పండిట్‌ అని చేర్చింది’ అని అహూజా వ్యాఖ్యానించారు. కాగా బీజేపీ ఎమ్మెల్యే అహూజా వ్యాఖ్యలపై రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్‌ పైలెట్‌ మండిపడ్డారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అహూజా ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ ఓట్ల కోసం కులం పేరును వాడుకొంటుందని ఆరోపించారు. గోవధ ఉగ్రవాదం కన్నా పెద్ద నేరమని, లవ్‌ జిహాద్‌ పేరుతో ముస్లింలు మతమార్పిడికి పాల్పడుతున్నారన్న అహూజా.. ​ఢిల్లీలో జరిగే లైంగిక దాడులకు 50 శాతం బాధ్యత జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులదే అని వ్యాఖ్యలు చేసి దుమారంరేపిన సంగతి తెలిసిందే.