ఈ- కామర్స్ .. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సరుకు విక్రయాల్లో రాజ్యమేలుతోంది. ఏ వస్తువైనా కావాలంటే . . ఇప్పుడు అంతా ఆన్ లైన్‌లో బుక్ చేస్తున్నారు. నిత్యావసర వస్తువులు సహా .. ఏదైనా కొనాలన్నా.. క్లిక్కుమనిపించాల్సిందే. ఇప్పటి వరకు మద్యానికి మాత్రం మినహాయింపు ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా ఆన్ లైన్‌లో విక్రయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొత్త మద్యం పాలసీ తీసుకొస్తున్న మధ్యప్రదేశ్ సర్కారు. . ఇప్పుడు మద్యానికి తలుపులు మరింత బార్లా తెరిచింది. మద్యం విక్రయాలపై 25 శాతం ఆదాయం పెంచుకునేందుకు కొత్త స్కీమ్‌కు శ్రీకారం చుట్టింది.  ఇప్పుడు విదేశీ మద్యాన్ని ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసుకుని ఇంటికే తెప్పించుకునే ఏర్పాట్లు చేసింది. 2020-2021 మద్యం పాలసీలో భాగంగా రాష్ట్రంలో 1061 విదేశీ మద్యం షాపులకు టెండర్లు ఆహ్వానించనుంది. ఈ దుకాణాల ద్వారా విదేశీ మద్యం ఆన్ లైన్ విక్రయాలు పెంచనుంది. ఈ- టెండర్ల ద్వారా ఈ మద్యం షాపులకు లైసెన్స్‌లు ఖరారు చేయనున్నారు. 


See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా