Update Aadhar Card Online: ఆధార్‌లో ఎన్‌రోల్‌మెంట్, అప్‌డేట్ కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను మార్చింది. 10 సంవత్సరాల క్రితం ఆధార్ నంబర్ కోసం ఎన్‌రోల్ చేసిన వారు గుర్తింపు, చిరునామా  సమర్పించాలని సూచించింది. అయితే కొత్త పత్రాలు ఇవ్వాలా వద్దా అనేది ప్రజల ఇష్టమని తెలిపింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొన్ని నెలల క్రితం 40 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా లాంచ్ అవుతోంది. మీరు ఆధార్ సేవా కేంద్రాలు లేదా స్పెషల్ క్యాంపులను సందర్శించి ఆధార్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు ఆధార్‌ను ఎందుకు అప్‌డేట్ చేస్తోంది..? ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి ఛార్జీ ఎంత..? కొత్త నిబంధనలకు సంబంధించిన వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 134 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు జారీ చేసింది. వీటిలో చాలా వాటి చిరునామాలు, ఇతర వివరాలు, మొబైల్ నంబర్లు మొదలైనవి మారిపోయాయి. 10 సంవత్సరాల క్రితం ఆధార్‌ను పొందే సమయానికి 14-15 సంవత్సరాల వయస్సు ఉన్నవారి రూపురేఖలు చాలా ఛేంజ్ అయ్యాయి. మీ ఆధార్‌లోని సమాచారం అప్‌డేట్ కాకపోతే.. వెంటనే చేయండి.  


ఎలా అప్‌డేట్ చేసుకోవాలి..?


ఆధార్‌ను  ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా అప్‌డేట్ చేసుకోవచ్చు. UIDAI వివిధ ప్రదేశాలలో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేస్తుంది. ఆధార్ సేవా కేంద్రాలలో కూడా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో చేయాలనుకుంటే.. myAadhaar పోర్టల్, యాప్‌లో చేసుకోవచ్చు. ఆధార్‌లో ఎలాంటి అప్‌డేట్‌కైనా ఛార్జీ ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకుంటే రూ.50 రుసుము చెల్లించాలి. ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే రూ.25 చెల్లించాలి. మీరు బయోమెట్రిక్ డేటా, మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటే ఆధార్ సేవా కేంద్రానికి మాత్రమే వెళ్లాలి. 


ఆధార్‌ అప్‌డేట్ పేరుతో ఆన్‌లైన్ కేటుగాళ్లు మోసం చేసే అవకాశం ఉంది. మీరు ఇలాంటి కాల్స్‌కు అస్సలు స్పందించకండి. మీకు వచ్చిన ఓటీపీలు ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ప్రభుత్వ పథకాలతో పాటు బ్యాంకింగ్ సేవలకు ఆధార్ లింక్ చేయడంతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరైనా ఫోన్ కాల్, సోషల్ మీడియా, ఈ-మెయిల్, వాట్సాప్ ద్వారా ఆధార్‌ను అప్‌డేట్ చేయమని అడిగితే.. అస్సలు స్పందించకండి. అదేవిధంగా ఆధార్‌తో పాట ఇతర వ్యక్తిగత వివరాలు లేదా పత్రాలను ఎవరితోనూ పంచుకోవద్దు.


Also Read: PAK Vs ENG Final: పసికూనల చేతిలో చావు దెబ్బతిని.. కసి తీర్చుకున్న పాక్, ఇంగ్లాండ్   


Also Read: Health Tips: మీకు ఇలా వేలు పెట్టుకునే అలవాటు ఉందా..? చాలా ప్రమాదకరం..  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook