New Rules From October 1st: అక్టోబర్‌ 1వ తేదీ నుంచి మన దేశంలో 10 రుల్స్ మారనున్నాయి. ఇది నేరుగా సామాన్యులపై ప్రభావం పడుతుంది. అందుకే మీరందరూ కూడా తెలుసుకోవాల్సిందే. ముఖ్యంగా ఆదాయ పన్ను, ఆధార్‌ కార్డు, పీపీఎఫ్‌,, సుకన్య సమృద్ధియోజనలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. ఎల్‌పీజీ ధరల పెరుగుదల..
ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌ ధరలను పెంచేశాయి. ఇది నేటి నుంచి అమలులోకి వస్తోంది. ఏకంగా రూ.50 వరకు వీటి ధరలు పెరిగాయి. అయితే, డొమెస్టిక్‌ ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరల్లో ఏ మార్పులు లేవు.


2. ఏటీఎఫ్ ధరలు..
ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్ (ATF) ధరలను తగ్గించనున్నారు. ఢిల్లీలో ఇంధన ధరల విషయానికి వస్తే రూ.87,597.22 కిలో లీటరుకు తగ్గించారు. గతంలో రూ.93,480.22 ఉండేది. ఇది విమానాయన సంస్థలకు బిగ్‌ రిలీఫ్ అని చెప్పవచ్చు.


3. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు లాయట్టీ ప్రొగ్రామ్‌లో మార్పులు చేసింది. యాపిల్‌ ఉత్పత్తులు, స్మార్ట్‌బై ప్లాట్‌ఫారమ్‌ రివార్డులు రిడీమ్‌ చేయడానికి క్వార్టర్‌కు ఒక్కసారి మాత్రమే వినియోగించే సదుపాయం కల్పించారు.


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


4. సుకన్య సమృద్ధి యోజన..
సుకన్య సమృద్ధి యోజనలో కూడా నేటి నుంచి మార్పులు జరగనున్నాయి. కేవలం గార్డియన్లు, పేరెంట్స్‌ మాత్రమే బాలిక ఖాతాను ఓపెన్‌ చేయాలి. లేకపోతే ఆ ఖాతాలు ఇకపై క్లోజ్‌ చేస్తారు.


5. పీపీఎఫ్ ఖాతా..
పీఎఫ్ ఖాతాల్లో కూడా భారీ మార్పులు చేశారు. మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే వెంటనే విలీనం చేసుకోవాలి. మైనర్‌, ఎన్‌ఆర్‌ఐ ఖాతాలపై కూడా మార్పులు చేశారు. ఇవి కూడా నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.


ఇదీ చదవండి: Brahmanandam: గిన్నిస్ అవార్డు గ్రహీత చేతుల మీదుగా ఐఫా అవార్డు అందుకున్న కామెడీ బ్రహ్మ..


6. బైబ్యాక్‌ షేర్‌..
బై బ్యాక్‌ షేర్‌ల పై ఇక నుంచి షేర్‌ హోల్డర్‌లు కూడా ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. గతంలో వీటిని కేవలం కంపెనీలు మాత్రమే భరించేవి.


7. ఆధార్‌ కార్డు..
నేటి నుంచి ఆధార్ కార్డు రూల్స్‌లో కూడా మార్పులు చోటు చేసుకోనున్నాయి. ప్యాన్‌ అప్లికేషన్‌ ఫారమ్‌, ఆదాయ పన్ను రిటర్నులకు ఆధార్‌ నమోదు ఐడీని నిర్ధారించాల్సిన అవసరం లేదు.


8. ఆదాయపు పన్ను..
బడ్జెట్‌ 2024లో ప్రస్తావించిన ఆదాయపు పన్ను రూల్స్‌ కూడా ఈరోజు నుంచి అమల్లోకి రానున్నాయి. టీడీఎస్‌ రేట్‌ తగ్గుతాయి. 5%,2% వరకు తగ్గుతాయి. 


9. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌..
పంజాబ్‌ నేషనల్‌ క్రెడిట్‌ కార్డు రూల్స్‌ కూడా నేటి నుంచి మారనున్నాయి. మినిమమ్ బ్యాలన్స్‌ నిర్వహణ, చెక్కుల రిటర్న్‌ ఛార్జీలు వంటి సర్వీసుల్లో మార్పుల చేశారు. కొత్త ఛార్జీల ధరలు కూడా ఈరోజునుంచి అమల్లోకి వస్తాయి.


10. ఎస్‌టీటీ..
సెక్యూరిటీ ట్రాన్సక్షన్‌ ట్యాక్స్ (STT) ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ (F&O) పెంచాయి. ప్రీమియం సేల్‌ ఆప్షన్‌ ను 0.0625% పెంచాయి.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.