September 1 New Rules: సెప్టెంబర్ 1 నుంచి కీలకమైన మార్పులు చోటుచేసుకోనున్నాయి.  ఇందులో కొన్ని మార్పులు మీ నెల ఖర్చులపై ప్రభావం చూపించనున్నాయి. ఇంకొన్ని ప్రయోజనం చేకూర్చనున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు ప్రకటన లాభం చేకూర్చవచ్చు. ఆ వివరాలు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి నెల 1వ తేదీనాటికి ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ల రేట్లలో మార్పులు చేస్తుంటుంది. ఎక్కువగా కమర్షియల్ గ్యాస్ ధరల్లో మార్పు వస్తుంటుంది. ఈసారి కూడా ఎల్బీజీ గ్యాస్ సిలెండర్ ధరపై సమీక్ష జరిగే అవకాశముంది. గత నెలలో కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర 8.50 రూపాయలు పెరిగింది. జూలైలో 30 రూపాయలు తగ్గింది. అదే విధంగా సీఎన్జీ , పీఎన్జీ ధరల్లో కూడా మార్పు రావచ్చు.


సెప్టెంబర్ 1 నుంచి ఫేక్ కాల్స్, మెస్సేజెస్ నియంత్రించనుంది. ట్రాయ్ ఈ మేరకు టెలికం కంపెనీలకు ఆదేశాలిచ్చింది. జియో, ఎయిర్‌టెల్, వోడోఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంపెనీలు టెలీ మార్కెటింగ్, కమర్షియల్ మెస్సేజ్‌లకు 140 సిరీస్‌తో ప్రారంభమయ్యే నెంబర్లు ఎంచుకోవాలని సూచించింది. 


ఇక హెచ్‌డిఎప్‌సి బ్యాంక్ రివార్డు పాయింట్లను పరిమితం చేయనుంది. వివిధ రకాల లావాదేవీలపై కస్టమర్లు 2 వేల వరకే పాయింట్లు పొందగలుగుతాారు. థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా జరిపే ఎడ్యుకేషనల్ పేమెంట్స్‌కు ఎలాంటి రివార్డు పాయింట్లు ఉండవు. ఇక ఐడీఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డుకు చెల్లించాల్సిన మినిమం ఎమౌంట్ తగ్గించనుంది. పేమెంట్ డేట్ కూడా 18 నుంచి 15 రోజులకు తగ్గించనుంది. 


కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ప్రకటన వెలువడనుంది. డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ప్రకటన ఉండవచ్చు. డీఏను 3 శాతం పెంచనుంది. అదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 53 శాతానికి పెరగనుంది.


ఆధార్ కార్డు అప్‌డేట్ చేసేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 14 కానుంది. సెప్టెంబర్ 14 తరువాత ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలంటే తగిన రుసుపు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ గడువు తేదీని యూఐడీఏఐ పలు మార్లు పొడిగించింది.


Also read: NEET PG 2024 Results: నీట్ పీజీ 2024 ఫలితాలు విడుదల natboard.edu.in ఇలా చెక్ చేసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook