Digital Highways: రహదారులకు కొత్తరూపు.. హైదరాబాద్-బెంగుళూరు కారిడార్‌లో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు
Hyderabad-Bangalore Corridor: దేశంలో రహదారులు కొత్తరూపు సంతరించుకోనున్నాయి. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌తో డిజిటల్ రహదారులుగా మారనున్నాయి. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే, హైదరాబాద్-బెంగుళూరు కారిడార్‌ను ఎంపిక చేశారు. పూర్తి వివరాలు ఇలా..
Hyderabad-Bangalore Corridor: దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల కి.మీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (ఓఎఫ్‌సీ) మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) కృషి చేస్తోంది. 2024-25 నాటాకి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎమ్‌ఎల్), ఎన్‌హెచ్‌ఏఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం జాతీయ రహదారుల వెంట ఇంటిగ్రేటెడ్ యుటిలిటీ కారిడార్‌లను అభివృద్ధి చేస్తూ.. డిజిటల్ హైవేల నెట్‌వర్క్‌ను అమలు చేస్తోంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై 1,367 కి.మీ, హైదరాబాద్-బెంగుళూరు కారిడార్‌లో 512 కి.మీలు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేయనున్నారు.
ఆప్టికల్ ఫైబర్ కేబుల్ నెట్‌వర్క్‌లో 5జీ, 6జీ వంటి కొత్త తరం టెలికమ్యూనికేషన్ టెక్నాలజీలను ఉపయోగించనున్నారు. వీటిద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని పెంచనున్నారు. హైదరాబాద్–బెంగళూరు మధ్య 512 కిలోమీటర్ల మేర ఓఎఫ్‌సీ పనులకు ఆమోదం తెలిపినట్లు ఇటీవలె కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఢిల్లీ-ముంబై జాతీయ రహదారిపై 246 కిలోమీటర్ల పొడవైన ఢిల్లీ-దౌసా-లాల్సోట్ సెక్షన్ ఇటీవలె ప్రారంభించారు. అందులో ఆప్టికల్ ఫైబర్ కేబుల్‌ను అమర్చేందుకు మూడు మీటర్ల కారిడార్‌ను సిద్ధం చేశారు. ఈ ప్రాంతంలో 5జీ నెట్‌వర్క్‌ను అందించడంలో దోహదపడనుంది. ఢిల్లీ-దౌసా-లాల్సోట్ వరకు ఆధునిక ఎక్స్‌ప్రెస్ వే మొదటి దశను ఫిబ్రవరి 12న ప్రధాని మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఓఎఫ్‌సీ నెట్‌వర్క్ టెలికాం/ఇంటర్నెట్ సేవల కోసం డైరెక్ట్ ప్లగ్-అండ్-ప్లే (కంప్యూటర్‌కు కనెక్ట్ అయిన వెంటనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించడం) లేదా 'ఫైబర్-ఆన్-డిమాండ్' మోడల్‌ను అభివృద్ది చేస్తోంది. ఫిక్స్‌డ్ ప్రైస్ అలాట్‌మెంట్ ప్రకారం 'ఓపెన్ ఫర్ ఆల్' ప్రాతిపదికన వెబ్ పోర్టల్ ద్వారా అర్హత కలిగిన వినియోగదారులకు లీజుకు ఇవ్వనున్నారు. టెలికాం శాఖ, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)తో సంప్రదించి ఓఎఫ్‌సీ కేటాయింపు విధానాన్ని ఖరారు చేయనున్నారు.
Also Read: Karnataka Assembly Elections: బీజేపీకి మరో బిగ్ షాక్.. కీలక నేత గుడ్ బై
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12,500 కి.మీ హైవేలను నిర్మిస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్ (ఐఎన్‌టీ) ద్వారా రూ.10 వేల కోట్లను ఖర్చు చేసే యోచనలో ఉన్నట్లు కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12 వేల కి.మీ రోడ్డు కాంట్రాక్టులు, 12,500 కి.మీ హైవేలను నిర్మించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. మంత్రిత్వ శాఖ 2019-20లో 10,237 కి.మీ, 2020-21లో 13,327 కి.మీ మరియు 2021-22లో 10,457 కి.మీ హైవేలను నిర్మించింది.
Also Read: SRH Vs MI Highlights: ఐపీఎల్‌లో ఫస్ట్ వికెట్ తీసిన అర్జున్ టెండూల్కర్.. సంబురాలు చూశారా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook