Nipah Virus Cases: కేరళలో హై అలర్ట్.. 6కి చేరిన నిఫా వైరస్ కేసులు, ఇద్దరు మృతి
కేరళలో నిఫా వైరస్ పెరిగిపోతుంది. నిన్నటి వరకు 5 కేసులు నమోదు కాగా.. ఇపుడు మరో కేసు నమోదయింది. 39 ఏళ్ల వయసు గల వ్యక్తికీ నిఫా వైరస్ సోకినట్టు కనుగొన్నారు. ఇక కేరళ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 6 కేసులు నమోదయ్యాయి. ఆ వివరాలు..
Nipah Virus Cases: కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ క్రమంగా విజృభిస్తోంది. ఇప్పటికే 5 కేసులు నమోదు కాగా.. ఇప్పుడు మరో కేసు వెలుగులోకి వచ్చింది. తాజాగా 39 ఏళ్ల వ్యక్తికి ఈ నిఫా వైరస్ బారిన పడ్డినట్లు తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 నిఫా కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాణాంతక వైరస్ బారిన పడి.. ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు.
ఐదేళ్లుగా వెంటాడుతున్న వైరస్..
నిఫా అనే ప్రాణాంతక వైరస్ 2018లో కేరళ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఇప్పుడు నాలుగో దశలో వేగంగా వ్యాపిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తున్న నిఫా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని కేరళ రాష్ట్ర ఆరోగ్యశాఖ మినిస్టర్ వీణాజార్జ్ స్పష్టం చేశారు. ఈ వేరియంట్ వ్యాప్తి తక్కువగా ఉన్నా.. మరణాల రేటు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉందని మంత్రి తెలిపారు.
ఒకే జిల్లాలో కేసులు..
కేరళలో ప్రస్తుతం కొత్తగా నమోదవుతున్న కేసులు అన్నీ కోజీకోడ్ జిల్లాలోనే నమోదవ్వడం గమనార్హం. ఈ బుధవారం ఓ ఆరోగ్య కార్యకర్తకి కూడా నిఫా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అతనికి ప్రత్యక్ష్యంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగిన 706 మందిని ప్రభుత్వం ఇప్పటికే ఐసోలేషన్ లో ఉంచింది. వీరిలో 77 మంది ఎక్కువ రిస్కు కేటగిరీలో ఉన్నట్లు తెలిపింది. అయితే అలాంటి వారిలో ఎక్కువ రిస్కు కేటగిరీ వ్యక్తుల్లో ఎక్కువ లక్షణాలు కనిపించడం లేదని ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. 13 మందిలో మాత్రం తలనొప్పితో పాటు ఇతర లక్షణాలు కనిపిస్తాయని ఆమె వెల్లడించారు. వైరస్ ప్రభావం ఉన్న 7 గ్రామపంచాయితీలను ప్రభుత్వం క్వారంటైన్ చేసింది.
Also Read: Lokesh Delhi Tour: తల్లితో ఢిల్లీకు హుటాహుటిన నారా లోకేశ్ పయనం, కారణాలేంటి
చికిత్స లేదు..
అయితే ఈ వ్యాధికి పూర్తి స్థాయిలో చికిత్స లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ బారిన పడిన వ్యక్తులకు మోనో క్లోనల్ యాంటీబాడీ చికిత్స మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వైరస్ బారిన పడిన వ్యక్తుల్లో జ్వరం, శ్వాసకోశ సమస్యలతో పాటు తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వైరస్ ముదిరితే మెదడు వాపు, మూర్ఛ కారణంగా చివరికి మనిషికి మరణం సంభవించే అవకాశం ఉంది. కేరళలో వైరస్ ప్రారంభమైన 2018లో 21 మంది చనిపోగా.. ఆ తర్వాత 2019, 2021లో ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందింది.
నిఫా వైరస్ ఎలా సోకుతుంది..?
నిఫా అనే వైరస్ గబ్బిలాలు, పందుల ద్వారా మనుషుల్లో వ్యాప్తి చెందుతుంది. కాబట్టి అటవీ ప్రాంతాల్లో నివసించే వారు.. సగం కొరికిన పండ్లను తినే వారు ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంది. తాజాగా బయటపడిన నిఫా వైరస్ కేసులు అటవీ ప్రాంతానికి 5 కిలోమీటర్ల పరిధిలోనే నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కోజీకోడ్ జిల్లాలోని గ్రామ పంచాయితీలైన.. తిరువళ్లూరు, అతన్చేరి, మారుతోంకర, కుట్టియాడి, కాయక్కోడి, విల్యపల్లి, కవిలుంపర, వీల్యపల్లి, పురమేరి కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ జిల్లాలోని కొన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించి.. రాకపోకలను నియంత్రిస్తున్నారు.
Also Read: Birth Certificate: ఇక నుంచి బర్త్ సర్టిఫికెట్ చాలు గురూ.. అన్నింటికి సింగిల్ డాక్యుమెంట్‌గా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook