న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు కొత్త బడ్జెట్‌లో కొంత ఉపశమనం కల్గిస్తారని, రైతుల కోసం నూతన పథకాలు ఆవిష్కరణ, ఆటోమొబైల్‌పై జీఎస్‌టీ తగ్గింపు వంటి అంశాలను ఆశిస్తున్నారు.  ఎన్నో అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం కేంద్ర బడ్జెట్ 2020 ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా, వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటు స్లాబ్‌లో కోత, గ్రామీణ, వ్యవసాయ రంగాలకు తగ్గట్టుగా ఉండబోతున్నాయి. మౌలిక సదుపాయాల వ్యయంపై దూకుడుగా వ్యవహరించడం "ఫీల్-గుడ్" రెండవ సాధారణ బడ్జెట్‌లో భాగంగా ఉండనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగం ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు ప్రారంభమౌతుంది. గత దశాబ్దం కంటే భారత్ అధికంగా ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి సీతారామన్ వినియోగదారుల డిమాండ్, పెట్టుబడులను పెంచడానికి చర్యలు తీసుకోనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. సీతారామన్ ప్రవేశపెడుతున్న రెండవ బడ్జెట్‌లో ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడానికి, 2025 నాటికి భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యంగా నిర్ణయాలుంటాయి.


Also Read: బడ్జెట్ అంటే ఏమిటి.. Budget ఎందుకు ప్రవేశపెడతారు?


ఆర్థిక మార్కెట్ల విషయానికొస్తే.. సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ), లాంగ్ టర్మ్ క్యాపిటల్ గేయిన్స్ ట్యాక్స్ (ఎల్‌టీసీజీ)లపై ఉపశమనం కల్పిస్తారని, డివిడెంట్ ట్యాక్స్‌ను తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. జీడీపీ రేటు గత దశాబ్ధంతో పోల్చితే కనిష్టస్థాయికి పడిపోయింది. నిరుద్యోగ సమస్య గత 45ఏళ్లలోనే గరిష్టానికి పడిపోయింది. దీనిపై సైతం మోదీ సర్కార్ ఏ మేరకు నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 


శుక్రవారం విడుదల చేసిన 2019-20 ఎకనామిక్ సర్వే, వృద్ధిని పునరుద్ధరించడంపై దృష్టి పెట్టాలని మరియు ఆర్థిక క్రమశిక్షణను కొంచెం వీడాలని ప్రభుత్వానికి సూచించడం ద్వారా ఇప్పటికే పునాది వేసింది. అనుకూల ద్రవ్యోల్బణ నేపథ్యంతో  ఆర్‌బీఐ గతేడాది 110 బేసిస్ పాయింట్లను వడ్డీ రేట్లలో తగ్గించి ఆర్థిక మందగమనం నుంచి బయటపడే యత్నాలు చేసింది.  ప్రస్తుతం వృద్ధి పెంపుతో పాటు ఆర్థిక పరిపుష్టి తీసుకురావడంపై బడ్జెట్‌లో ప్రస్తావించనున్నారు.


వాస్తవిక జీడీపీ వృద్ధి ఈ ఆర్థిక సంవ్సరానికిగానూ 11 ఏళ్ల కనిష్టానికి 5 శాతానికి పడిపోతుందని అంచనా వేశారు. గత ఆర్థిక సంవత్సరంలో 6.1గా ఉంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం కూడా పెరగొచ్చని ఆర్థిక సర్వే పేర్కొంది. కార్పొరేట్ పన్ను తగ్గింపు, ఇతర ఉద్దీపన చర్యలు, అధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తీసుకురావడం, ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ఏకీకృతం చేసే ప్రణాళికలు కేంద్ర సర్కార్ తీసుకురానుంది.


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..