Kailash Vijayvargia on Nitish Kumar: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గియా అనుచిత విమర్శలు చేశారు. బీహార్‌లో నితీశ్ కుమార్ వ్యవహారం విదేశాల్లో యువతులు తమ బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చినట్లుగా ఉందన్నారు. 'నేను విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడెవరో చెప్పారు.. ఇక్కడి అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు మారుస్తారని.. నితీశ్ కుమార్ కూడా అంతే.. ఆయన ఎప్పుడు ఎవరి చేయి పట్టుకుంటారో, ఎవరి చేయి వదులుతారో తెలియదు.' అని కైలాష్ విజయ్‌వర్గియా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా విజయ్‌వర్గియా ఈ వ్యాఖ్యలు చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కైలాష్ విజయ్ వర్గియా ఇలాంటి కామెంట్స్ చేయడం కొత్తేమీ కాదు. కొద్ది నెలల క్రితం అగ్నివీర్స్‌పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సైన్యంలో అగ్నివీరులుగా సర్వీస్ పూర్తి చేసుకున్నవారిని బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ గార్డులుగా నియమించుకుంటామని కామెంట్ చేశారు. ఆ తర్వాత మాట మార్చిన ఆయన.. టూల్‌కిట్ గ్యాంగ్ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని ఆరోపించారు. 


ఈ సంగతి పక్కనపెడితే.. బీహార్‌లో బీజేపీతో మిత్ర బంధానికి గుడ్‌బై చెప్పిన నితీశ్ కుమార్ మళ్లీ ఆర్జేడీతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. 2015 తరహాలోనే మరోసారి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా, తేజస్వి యాదవ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చినట్లే తమ పార్టీని కూడా చీల్చేందుకు బీజేపీ కుట్ర పన్నిందని నితీశ్ భావించారు. ఆర్‌సీపీ సింగ్ వ్యవహారంతో ఆ అనుమానాలు బలపడటంతో వెంటనే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశమై బీజేపీతో తెగదెంపులపై నిర్ణయం తీసుకున్నారు. నితీశ్ ఎన్డీఏని వీడటంతో సహజంగానే బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కైలాష్ విజయ్ వర్గియా నితీశ్‌పై అనుచిత విమర్శలు చేశారు.



Also Read: Horoscope Today August 19th : నేటి రాశి ఫలాలు.. ఈ రెండు రాశుల వారిని నిరాశ, నిస్తేజం అలుముకుంటుంది..  


Also Read: Big Debate With Bharath : కోమటిరెడ్డిపైకి అద్దంకిని ఉసిగొల్పింది రేవంత్ రెడ్డేనా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook