NMDC JOBS: నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో ఉద్యోగాల భర్తీకై దరఖాస్తు చేసుకోవచ్చు..వివరాలిలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వ (Central government) ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి ఇదొక మంచి అవకాశం. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ(NMDC)లో ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు చెందిన జార్ఘండ్‌లోని టాకిసుడ్ నార్త్ కోల్‌మైన్‌లో కాంట్రాక్ట్ బేసిస్‌లో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 89 పోస్టులున్నాయి.


కొల్లియరీ ఇంజనీర్ విభాగంలో 2, లైజనింగ్ ఆఫీసర్ పోస్టులు 2, మైనింగ్ ఇంజనీర్ పోస్టులు 12, సర్వేయర్ పోస్టులు 2, ఎలక్ట్రికల్ ఓవర్‌మెన్ పోస్టులు 4, మైన్ ఓవర్‌మెన్ పోస్టులు 25, మెకానికల్ ఓవర్‌మెన్ 4, మైన్ సిర్దార్ పోస్టులు 38 ఉన్నాయి. పోస్టును బట్టి పదవ తరగతి నుంచి ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ చదివినవారు అర్హత కలిగి ఉంటారు. దాంతో పాటు నిర్ధారిత సిర్దార్ ధృవీకరణ పత్రముండాలి. అనుభవం కూడా తప్పనిసరి.


ఎగ్జిక్యూటివ్ గ్రేడ్ పోస్టుల ఇంటర్వ్యూ ఆధారంగా సూపర్ వైజర్లు, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని రాత పరీక్ష,సూపర్ వైజరీ స్కిల్‌టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు వంద మార్కులకు ఉంటుంది. ఆంగ్ల , హిందీ మాధ్యమంలో పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన సూపర్ వైజరీ పోస్టు అభ్యర్ధుల్ని సూపర్ వైజరీ స్కిల్‌టెస్ట్, నాన్ ఎగ్జిక్యూటివ్ అభ్యర్ధులను స్కిల్‌టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ జూన్ 22, 2021గా ఉంది. ఇతర వివరాల కోసం www.nmdc.co.in వెబ్‌సైట్‌ను క్లిక్ చేయండి.


Also read: Covid Vaccination: వ్యాక్సినేషన్ అంశంలో కేంద్రం కీలక నిర్ణయం, 18 ఏళ్లు దాటితే ఇకపై


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook