'కరోనా వైరస్' దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటు లాక్ డౌన్ అమలులో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం  ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లాక్ డౌన్ దెబ్బకు విమానాలు, రైళ్లు, బస్సులు అన్నీ బంద్ అయిపోయాయి. దేశవ్యాప్తంగా స్తబ్దత  వాతావరణం ఏర్పడింది. దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా 37 వందల రైళ్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.  దీంతో సామాన్య ప్రయాణీకులు ఎక్కడికక్కడే ఉండి పోయారు. రైళ్ల రాకపోకలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతాయని ఎదురు చూస్తున్నారు.


మరోవైపు రైలు రాకపోకలు ప్రారంభమయ్యే తేదీలపై ఇప్పటికే సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. ఏప్రిల్ 14న కేంద్రం విధించిన 21 రోజుల లాక్ డౌన్ పూర్తవుతుందని .. ఏప్రిల్ 15 నుంచి రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమవుతాయని సోషల్ మీడియాలో మెసేజ్ లు వైరల్ అవుతున్నాయి. అంతే కాదు.. రైలు ప్రయాణం చేసే వారు 4 గంటల ముందే రైల్వే స్టేషన్  కు చేరుకోవాలని ..  తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలనే మార్గదర్శకాలు కూడా వైరల్ అవుతున్నాయి. 


ఐతే ఈ మెసేజ్ లపై రైల్వే మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో జరుగుతున్నవి అన్ని పుకార్లేనని తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి ట్రెయిన్ సర్వీసులపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. రైలు ప్రయాణీకులకు ఎలాంటి మార్గదర్శకాలు కూడా జారీ చేయలేదని తెలిపింది. ఇలాంటి వారిపై నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని తెలిపింది.



జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..