లోక్‌పాల్ బడ్జెట్‌లో ఏ మార్పూ లేదు..!
లోక్‌పాల్ (అవినీతి నిరోధక బిల్లు) అమలుకి నోచుకోకపోయినా.. దానికి కూడా తాజా బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం గమనార్హం.
లోక్‌పాల్ (అవినీతి నిరోధక బిల్లు) అమలుకి నోచుకోకపోయినా.. దానికి కూడా తాజా బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం గమనార్హం. గత సంవత్సరం కేటాయించినట్లు గానే ఈ సంవత్సరం కూడా లోక్ పాల్ వస్తే ఏర్పడే సమితి లేదా సంఘం కోసం రూ.4.29 కోట్లు కేటాయించింది కేంద్రం.
ఈ క్రమంలో సెంట్రల్ విజిలెన్స్ కమీషన్‌కు కూడా రూ.32.61 కోట్లు కేటాయింపులు చేసింది. లోక్ పాల్, లోకాయుక్త యాక్టు 2013 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో లోక్ పాల్ పనిచేసే అవకాశం ఉండగా.. లోకాయుక్తలు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పనిచేయాలి.
తొలుత లోక్ పాల్‌కి సంబంధించి కనీసం 8 కోట్ల రూపాయలైనా కేటాయించాలని భావించిన కేంద్రం ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. గతంలో మాదిరిగానే రూ.4.29 కోట్ల రూపాయలను కేటాయించింది