న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం ఘటనలో ఏడేళ్ల తర్వాత కేసులో దోషులకు శిక్ష పడనుంది. నేడు పాటియాలా హౌస్ కోర్టు విచారణ అనంతరం.. నలుగురు నిందితులు ముకేశ్, పవన్ గుప్తా, అక్షయ్‌ ఠాకూర్, వినయ్ శర్మలకు ఫిబ్రవరి 1న ఉదయం 6 గంటలకు ఉరిశిక్షను అమలు చేయాలని రెండోసారి డెత్ వారెంట్ జారీ కావడంపై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఉరిశిక్ష అనగానే చాలా మందికి కొన్ని అపోహలుంటాయి. లేక మరణశిక్ష అమలు చేసే ముందు ఆ ఖైదీ చివరి కోరిక ఏంటని తెలుసుకుంటారని భావిస్తుంటాం. ఉరితీసే ముందుకుగా జైలుసిబ్బంది ఒకరు రొప్పుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆపండి.. అనడం లాంటివి సినిమాల్లో చూస్తుంటాం. ఉరితీసే ముందు ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని తెలుసుకుంటారు.. నా మాట ఒక్కసారైనా వినండి అనే సినిమా డైలాగ్స్ రొటిన్‌గా చూస్తుంటాం. అయితే సినిమా కోసం తెరకెక్కించే ఆ సీన్లు రియల్ లైఫ్‌లో జరుగుతాయనుకుంటాం. ఉరిశిక్ష పడ్డ ఖైదీ చివరి కోరిక తెలుసుకోవడం లాంటివి జైలు మాన్యువల్‌లో ఉండవట. ఈ విషయాన్ని తిహార్ జైలు మాజీ డైరెక్టర్ జనరల్ అజయ్ కశ్యప్ జీ తెలిపారు.


Also Read: నిర్భయ భయానక ఘటన రోజు ఏం జరిగింది?


జీ న్యూస్‌తో అజయ్ కశ్యప్ మాట్లాడుతూ.. ‘చివరి కోరిక ఏంటని ఉరితీసేముందు ఖైదీలను అడటం సినిమాల్లో చూస్తుంటాం. కానీ నిజ జీవితంలో అలా ఉండదు. మరణశిక్ష పడ్డ ఖైదీల చివరికోరికను చట్టపరంగా ఎలాంటి విలువ ఉండదు. ఒకవేళ చివరికోరిక అడిగితే.. నా ఉరిశిక్షను వాయిదా వేయాలని దోషి కోరాతాడనుకోండి.  చట్టపరంగా నిర్ణయించిన మ శిక్షను అలా వాయిదా వేయడం కుదరదు. అయితే ఉరిశిక్ష పడ్డ ఖైదీ తన ఆస్తులను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాటో వీలునామా రాసే అవకాశం మాత్రమే ఉంటుందని’ వివరించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..