SSR death case: బీహార్ పోలీసులపై కేసు.. స్పందించిన డీజీపీ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై ( Sushant Singh Rajput`s death case ) దర్యాప్తు చేపట్టడానికి ముంబై వెళ్లిన బీహార్ పోలీసులపై ముంబై పోలీసులు ( Mumbai cops ) కేసు నమోదు చేశారని వస్తున్న పుకార్లపై బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు.
పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై ( Sushant Singh Rajput's death case ) దర్యాప్తు చేపట్టడానికి ముంబై వెళ్లిన బీహార్ పోలీసులపై ముంబై పోలీసులు ( Mumbai cops ) కేసు నమోదు చేశారని వస్తున్న పుకార్లపై బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు. ముంబైలో బీహార్ పోలీసులపై ( Bihar police ) ఎటువంటి కేసు నమోదు కాలేదని ఈ సందర్భంగా గుప్తేశ్వర్ పాండే స్పష్టంచేశారు. ముంబై పోలీసు కమిషనర్ స్వయంగా ఈ విషయాన్ని తనకు ఫోన్ చేసి చెప్పినట్టు గుప్తేశ్వర్ పాండే ట్విటర్ ద్వారా వెల్లడించారు. బీహార్ పోలీసులపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జరుగుతున్న ప్రచారం అంతా పుకార్లేనని ఆయన కొట్టిపారేశారు.