సంచలన నిర్ణయాలకు చిరునామాగా మారిన కేంద్ర ప్రభుత్వం మరో సంచలనమైన నిర్ణయం తీసుకుంది. 2018 నుంచి హజ్ యాత్రికులకి మంజూరు చేసే సబ్సీడీని నిలిపేస్తున్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. హజ్ యాత్రికులకి ఇచ్చే సబ్సీడీ మొత్తాన్ని మైనారిటీల విద్యా అవకాశాలకి కేటాయించనున్నట్టు కేంద్రం పేర్కొంది. ముఖ్యంగా మైనారిటీల్లో ఆడపిల్లల చదువుకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వి ప్రకటించారు. ఇంతకు ముందెప్పుడు లేనంత అధిక సంఖ్యలో 1.75 లక్షల మంది ముస్లింలు ఈ ఏడాది హజ్‌కి వెళ్లాలనుకుంటున్నారని మంత్రి చెప్పారు.


హజ్ యాత్రికులకు తొలగించిన సబ్సీడీ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం మైనారిటీ మహిళా సాధికారితకు, మైనారిటీ వర్గాల్లోని ఆడపిల్లల చదువుకోసం కేటాయించనుంది.